Site icon NTV Telugu

Balakrishna: బాలయ్య అనింది ఎన్టీఆర్ ని కాదు రా బాబు… ఇది చూడండి కాస్త

Balakrishna

Balakrishna

స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు వర్ధంతి సంధర్భంగా… ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా నందమూరి ఫ్యామిలీలో ఉన్న మనస్పర్ధలు బయట పడ్డాయి, బాలయ్య కోపంతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలని తొలగించమన్నాడు, బాబాయ్-అబ్బాయికి మధ్య దూరం మరింత పెరుగుతోంది.. నందమూరి ఫ్యామిలీలో మరోసారి విబేధాలు బయటపడ్డాయి.. ఇలా రకరకాల కామెంట్స్ ఈరోజు సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్, సోషల్ మీడియా యుజర్స్ కూడా బాలయ్య ఓపెన్ గా ఎన్టీఆర్ గురించి అలా ఎలా మాట్లాడాడు అంటూ షాక్ అవుతున్నారు. అయితే, అసలు విషయం ఇది కాదు.. బాలయ్య కోప్పడింది నిజమే.. కానీ, ఆ కోపానికి కారణం వేరే ఉందని చెబుతున్నారు.. ఎన్టీఆర్ వర్ధంతి కోసం కట్టిన ఫ్లెక్సీలే బాలయ్య కోపానికి కారణం అయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నమాట.

Read Also: NTR: ఇకపై యంగ్ టైగర్ కాదు… మ్యాన్ ఆఫ్ మాసెస్!

అయితే, ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా కొందరు అభిమానులు అత్యుత్సాహం చూపిస్తూ ‘నందమూరి తారకరామారావు 28వ వర్ధంతికి విచ్చేయనున్న జూనియర్ ఎన్టీఆర్ కి స్వాగతం.. సుస్వాగతం..” అని ఫ్లెక్సీలు వేశారు. వర్ధంతికి స్వాగతం అని ఎలా వేశారో, ఎందుకు వేశారో.. ఆ ఫ్లెక్సీ డిజైన్ చేసిన అభిమానులకే తెలియాలి.. కానీ, ఈ ఫ్లెక్సీ చూడగానే ఎవరికైనా కోపం వస్తుంది. ఇదే బాలయ్య విషయంలో కూడా జరిగిందని టీడీపీ వర్గాలు చెబుతున్నమాట.. ఇది పూర్తిగా బయటకి రాకపోవడంతో బాలయ్య.. ఎన్టీఆర్ ఫ్లెక్సీలని తొలగించామన్నాడు అనే వార్తని వైరల్ చేస్తున్నారని వారు వాపోయారు. ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వెర్బల్ వార్ జరుగుతోంది.. కానీ, బాలయ్య ఫ్లెక్సీ తీసేయాలని చెప్పడం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Read Also: Nandamuri Family: తాతకి తారక్ నివాళి… జై ఎన్టీఆర్ నినాదాలతో దద్దరిల్లిన ఎన్టీఆర్ ఘాట్

Exit mobile version