Real Reason Behind Kalki 2898 AD Movie Postponement: ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూపొందుతోన్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ‘కల్కి 2898 AD’ ఒకటి. తొలుత ‘ప్రాజెక్ట్ కే’గా ఈ సినిమాని ప్రకటించిన చిత్రబృందం.. రీసెంట్‌గా శాన్‌డియాగో కామిక్‌కాన్ ‘కల్కి 2898 ఏడీ’గా టైటిల్ ప్రకటించింది. ఇదే సమయంలో గ్లింప్స్ కూడా రిలీజ్ చేసింది. ఊహించిన దానికంటే ఆ టీజర్ ఔట్‌స్టాండింగ్‌గా ఉండటంతో.. ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక అప్పటి నుంచి ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేయబోతున్నారనే డిమాండ్ అభిమానుల నుంచి పెరిగింది. సాక్షాత్తూ దర్శకధీరుడు రాజమౌళి సైతం ‘కల్కి’ రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్ అంటూ ట్వీట్ చేశారంటే.. ఈ సినిమా కోసం అందరూ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
Gold Today Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు!
ఈ నేపథ్యంలో కల్కి రిలీజ్ డేట్‌పై నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాని మే 9వ తేదీన వాయిదా వేయనున్నారన్నదే ఆ వార్త సారాంశం. తొలుత ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ, ఇప్పుడు మే 9న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు ఓ బలమైన కారణం ఉంది. గతంలో మే 9న విడుదలైన మహానటి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ చిత్రం.. రికార్డులను తిరగరాస్తూ భారీ బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా అదే రోజు రిలీజై.. అప్పట్లో వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో.. ‘కల్కి 2898 AD’ సినిమా విషయంలోనూ నిర్మాత అశ్వినీదత్ అదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Parliament: నేడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం!.. లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం