RC16 : రామ్ చరణ్ ‘పెద్ది’.. ఫస్ట్ లుక్ అదిరింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ సూపర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న RC 16 ఫస్ట్ లుక్ వచ్చేసింది. సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ సినిమాతో సినీ నిర్మాణ రంగంలోకి నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు వెంకట సతీష్ కిలారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందనున్న తొలి సినిమా ఇదే కావటం విశేషం. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
కాగా నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా ప్రీ లుక్ పోస్టర్‌ను రూపొందించారు. ఇందులో రామ్ చరణ్ లుక్ ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి. రా అండ్ రస్టిక్, రగ్డ్ లుక్‌లో రామ్ చరణ్ కనిపించారు. చేతిలో చుట్ట, పొడవైన జుట్టు, గుబురు గడ్డం లుక్‌లో రేపు రామ్ చరణ్ దర్శనం ఇచ్చారు. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్‌ను ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలానే బుచ్చిబాబు చూపించాడు. మాస్ పల్స్ తెలిసిన బుచ్చిబాబు రామ్ చరణ్‌ను మరింత రగ్డ్ లుక్‌లో చూపించాడు అని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తేనే అర్థం అవుతోంది. కాగా.. ఏ ఆర్ రెహమాన్ పెద్ది సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Tags
- Peddi
- Ram Charan
- RC 16
తాజావార్తలు
-
Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
-
Peddi: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ‘పెద్ది’ ట్రైలర్ తర్వాత ఫ్యాన్స్‌కు ఇచ్చే గిఫ్ట్ ఇదే!
-
NEET Paper Leak: రూ. 30 వేలకే నీట్ పేపర్?.. లీక్‌లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల ప్రమేయం..
-
Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!