NTV Telugu Site icon

RC16 : రామ్ చరణ్ ‘పెద్ది’.. ఫస్ట్ లుక్ అదిరింది

Rc16

Rc16

గ్లోబల్ సూపర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న RC 16 ఫస్ట్ లుక్ వచ్చేసింది. సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ సినిమాతో సినీ నిర్మాణ రంగంలోకి నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు వెంకట సతీష్ కిలారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందనున్న తొలి సినిమా ఇదే కావటం విశేషం. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా ప్రీ లుక్ పోస్టర్‌ను రూపొందించారు. ఇందులో రామ్ చరణ్ లుక్ ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి. రా అండ్ రస్టిక్, రగ్డ్ లుక్‌లో రామ్ చరణ్ కనిపించారు. చేతిలో చుట్ట, పొడవైన జుట్టు, గుబురు గడ్డం లుక్‌‌లో రేపు రామ్ చరణ్ దర్శనం ఇచ్చారు. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్‌ను ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలానే బుచ్చిబాబు చూపించాడు. మాస్ పల్స్ తెలిసిన బుచ్చిబాబు రామ్ చరణ్‌ను మరింత రగ్డ్ లుక్‌లో చూపించాడు అని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తేనే అర్థం అవుతోంది. కాగా.. ఏ ఆర్ రెహమాన్ పెద్ది సినిమాకు సంగీతం అందిస్తున్నారు.