కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం “ఆర్సి 15”. ఈ హై బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్‌లో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, మలయాళ హీరో సురేష్ గోపి నెగిటివ్ రోల్స్‌లో కనిపించనున్నారు. సునీల్, అంజలి, నవీన్ చంద్ర కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు. 170 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. థమన్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే అక్టోబర్ 22న పూణేలో ప్రారంభమైంది.
Read Also : బాలయ్య “అన్‌స్టాపబుల్”లో ఎన్టీఆర్, ప్రభాస్
ఇదే ఫస్ట్ షెడ్యూల్ కాగా ఇందులో చరణ్, ఫైటర్స్‌పై యాక్షన్‌తో కూడిన పోరాట సన్నివేశాన్ని చిత్ర బృందం రూపొందించింది. ప్రస్తుతం చరణ్‌తో పాటు హీరోయిన్ కియారా అద్వానీపై ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం శంకర్-రామ్ చరణ్ సినిమా మొదటి షెడ్యూల్ నవంబర్ 2 న పూర్తవుతుంది. కొంత విరామం తర్వాత టీమ్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చి రెండో షెడ్యూల్‌ను ప్రారంభించనుంది.
