మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ కి పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకోని, శంకర్ మార్క్ సోషల్ ఎలిమెంట్స్ కలిపి రూపొందుతున్న ఈ సినిమాని ఒక నెలలో 12 రోజులు మాత్రమే షూట్ చేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన దిల్ రాజు, “శంకర్ భారతీయుడు 2 సినిమాని, రామ్ చరణ్ సినిమాని బాలన్స్ చేస్తూ షూట్ చేస్తున్నాడు. అందుకే ఒక నెలలో 12 రోజులు RC 15 షూటింగ్ జరుగుతోంది, ఇంకో 12 రోజులు భారతీయుడు 2 షూటింగ్ చేసుకుంటున్నారు” అని చెప్పాడు.
RC 15, భారతీయుడు… ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యేవే. అలాంటి సినిమాలకి టైం కావాలి, ఎంత ఎక్కువ టైం కేటాయిస్తే అంత మంచి ఔట్పుట్ వస్తుంది. మాములుగా అయితే ఒక పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించే దర్శకుడు ఆ సినిమా అయ్యే వరకూ ఇంకో సినిమా గురించి ఆలోచించడు. దర్శకుడు శంకర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాలని తెరకెక్కిస్తు పెద్ద సాహసమే చేస్తున్నాడు. శంకర్ చేస్తున్న ఈ రెండు పడవల ప్రయాణం ఎంత వరకు సక్సస్ అవుతుందో తెలియదు కానీ ‘RC 15’ కొత్త షెడ్యూల్ మాత్రం న్యూజిలాండ్ లో జరుగుతోంది. చరణ్ కియారాలపై ఒక సాంగ్ ని ఇక్కడ షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక చిత్ర యూనిట్ తిరిగొచ్చి, డిసెంబర్ నెలలో ‘RC 15’ కొత్త షెడ్యూల్ ని వైజాగ్ లో స్టార్ట్ చేయనున్నారు.