NTV Telugu Site icon

Ram Charan: RC 15 సెట్స్ లో మెగా పవర్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్

Ram Charan

Ram Charan

మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్ తేజ్. అతి తక్కువ కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న చరణ్, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తండ్రిని మించిన తనయుడిగా కాంప్లిమెంట్స్ అందుకుంటున్నాడు. గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్ మార్చ్ 27న పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. తన 38వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న చరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ లో భారి బడ్జట్ సినిమా చేస్తున్న చరణ్, ఈ మూవీ సెట్స్ లో తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. శంకర్, కియారా అద్వానీ, ప్రభుదేవా, గణేష్ మాస్టర్, దిల్ రాజులతో పాటు కాస్ట్ అండ్ క్రూ అంతా కలిసి రామ్ చరణ్ బర్త్ డేని సెలబ్రేట్ చేశారు. హైదరాబాద్ లో కియారా అద్వానీ, రామ్ చరణ్ పైన ప్రభుదేవా మాస్టర్ డిజైన్ చేసిన సాంగ్ షూట్ చేస్తున్న చిత్ర యూనిట్, ఈ సాంగ్ షూటింగ్ స్పాట్ లో చరణ్ తో కేక్ కట్ చేయించారు.

Read Also: Ram Charan: RC 15 సెట్స్ లో మెగా పవర్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్

ప్రస్తుతం రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో చరణ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. మార్చ్ 27న చరణ్ పుట్టిన రోజు మెగా అభిమానులకి స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా, పాన్ ఇండియా లెవల్లో హ్యుజ్ బజ్ ని జనరేట్ చేసేలా RC 15 టైటిల్, ఫస్ట్ లుక్ లని రిలీజ్ చేస్తారు అనే టాక్ వినిపిస్తోంది. చరణ్ బర్త్ డే రోజునే RC 15 ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసారట. మరి శంకర్, చరణ్ ని ఎలా చూపించబోతున్నాడు? సోషల్ మీడియాలో వినిపిస్తున్న ‘సీఈఓ’ అనే టైటిల్ నిజంగానే ఫిక్స్ చేసారా లేక అది అది జస్ట్ రూమర్ మాత్రమేనా అనేది తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Read Also: Shikhar Dhawan : ప్రేమించండి.. కానీ పెళ్లి మాత్రం చేసుకోకండి..

Show comments