Site icon NTV Telugu

మాస్ మహరాజా వెనుక పది లక్షల మంది…!

Raviteja

Raviteja

మాస్ మహరాజా రవితేజ మొదటి నుండీ పబ్లిక్ కు కాస్తంత దూరంగానే ఉంటాడు. అలానే ఫ్యాన్స్ తో కలిసి హంగామా చేయడం కూడా తక్కువే. నిజానికి తన సినిమాలు విడుదలైనప్పుడు భారీ ప్రచారానికీ రవితేజ పెద్దంత ఆసక్తి చూపించే వాడు కాదు. కానీ ఇప్పుడు ఈ మాస్ మహరాజా రూట్ మార్చాడు. లోకం పోకడ తెలుసుకుని మెసులుకోవడం మొదలెట్టాడు. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా ఇవ్వడం ప్రారంభించాడు. చిత్రసీమలోనూ బయటా జరుగుతున్న సంఘటనల పట్ల స్పందిస్తున్నాడు. దీంతో ట్విట్టర్ లో రవితేజాను ఫాలో అవుతున్న వారి సంఖ్య అక్షరాల పది లక్షలు అంటే ఒక మిలియన్ కు చేరింది.

చిత్రం ఏమంటే రవితేజా మాత్రం కేవలం ఇద్దరినే ఫాలో అవుతున్నాడు. అందులో ఒకరు అతను అభిమానించి, ఆరాధించే అమితాబ్ బచ్చన్ కాగా, మరొకరు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్. ఇదిలా ఉంటే, మొన్నటి వరకూ ఆచితూచి సినిమాలను అంగీకరించిన రవితేజ ఇప్పుడు ఏకంగా ఐదు సినిమాలను లైన్ లో పెట్టేశాడు. ‘ఖిలాడీ’ మూవీ విడుదల సిద్ధం కాగా, ‘థమాకా, రామారావ్ ఆన్ డ్యూటీ’ సెట్స్ పై ఉన్నాయి. దీనితో పాటు ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు చేయబోతున్నట్టు రవితేజ ప్రకటించాడు. సో… రెండేళ్ళ పాటు రవితేజ యమా బిజీ అనే చెప్పాలి.

Exit mobile version