Site icon NTV Telugu

హైదరాబాదీ బ్యూటీతో రవితేజ రొమాన్స్ ?

ravanasura

గోపీచంద్ మలినేనితో ‘క్రాక్’ సక్సెస్ తర్వాత మాస్ మహారాజా రవితేజ కెరీర్‌ లో కొత్త మలుపును అందుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త కథాంశాలతో విభిన్నమైన చిత్రాలతో ప్రయోగాలు చేస్తున్నాడు. టాలీవుడ్‌లో నాలుగు చిత్రాల చిత్రీకరణలో బిజీగా ఉన్న రవితేజ దూసుకెళ్తున్నారు. అందులో ‘ఖిలాడీ’, ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి చిత్రాలు ఉన్నాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని రవితేజ కూడా నిర్మిస్తున్నాడు. ఇక ఆయన ఖాతాలో ఉన్న మరో చిత్రం “రావణాసుర”. ‘స్వామి రారా’ దర్శకుడు సుధీర్ వర్మ, రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రమిది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రత్యేకమైన కథతో రాబోతోంది. కొన్ని రోజుల క్రితం సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఆసక్తిని రేకెత్తించింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… తాజాగా “రావణాసుర” సినిమాలో కన్పించబోయే హీరోయిన్ గురించి కొన్ని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తల ప్రకారం హైదరాబాద్ అమ్మాయితో రవితేజ “రావణాసుర”లో రొమాన్స్ చేయబోతున్నాడట.

https://ntvtelugu.com/ntv-top-filmy-bytes-29-12-2021/

ఈ చిత్రంలో కథానాయికగా ‘జాతి రత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించబోతోంది అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక మరో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ‘జాతి రత్నాలు’తో ఫస్ట్ హిట్ అందుకున్న ఫరియా కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండిపోయింది. కానీ ఇటీవల కాలంలో ఆమెకు ఆఫర్లు పెరిగినట్టుగా కన్పిస్తోంది. కాగా “రావణాసుర” చిత్రాన్ని ఆర్‌టి టీమ్‌ వర్క్స్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌ లపై రవితేజ, అభిషేక్ నామా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version