Site icon NTV Telugu

Raviteja: పవన్ డైరెక్టర్ ని అడ్డంగా బుక్ చేసిన మాస్ మహారాజా…

Harish Shankar

Harish Shankar

మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ తో మంచి జోష్ లో ఉన్నాడు. హ్యాట్రిక్ హిట్ కోసం ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి ‘రావణాసుర’గా రానున్నాడు రవితేజ. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ని మాస్ మహారాజా ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు. రావణాసుర రిలీజ్ కి మరో 48 గంటలు మాత్రమే ఉండడంతో అభిమానులతో చాట్ సెషన్ నిర్వహించాడు రవితేజ. #AskRavanasura పేరుతో నిర్వహించిన చాట్ సెషన్‌లో ఫాన్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పిన రవితేజ, రావణాసుర సినిమా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ని అభిమానులకి ఇచ్చాడు. ఈ చాట్ సెషన్ లో ఒక అభిమాని హరీష్ శంకర్‌తో మరొక సినిమా చేయాలని రవితేజను రిక్వెస్ట్ చేశాడు. వేరే హీరో అయితే చూద్దాం, చేద్దాం, కథ కుదరాలి లాంటి సమాధానాలు చెప్తాడు కానీ అక్కడ ఉన్నది రవితేజ కదా అందుకే సూపర్బ్ ఆన్సర్ ఇస్తూ హరీష్ శంకర్ ని ఇరికించాడు.

అభిమాని రిక్వెస్ట్ కి తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన రవితేజ “ఏమ్మా హరీష్.. ఏదో అడుగుతున్నారు నిన్నే” అంటూ హరీష్ శంకర్ ని డైరెక్ట్ ట్యాగ్ చేశాడు. ఈరోజు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పనుల్లో బిజీగా ఉన్నా కూడా హరీష్ శంకర్, రవితేజ ట్వీట్ కి వెంటనే రెస్పాండ్ అయ్యాడు. “అన్నయ్యతో సినిమా చేసేందుకు ఎప్పుడూ రెడీ. నిజానికి ఒక పీరియడ్ డ్రామాపై (Periodic Drama) వర్క్ చేస్తున్నాను. అతి త్వరలోనే హిస్టరీ రిపీట్ చేయబోతున్నాం. థాంక్యూ అన్నయ్య” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో మాస్ మహారాజా ఫాన్స్ అంతా జోష్ లోకి వచ్చి కామెంట్స్ చేస్తున్నారు. హరీష్ శంకర్ లోని దర్శకుడిని అందరికన్నా ముందు గుర్తించిన రవితేజ, షాక్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఆ మూవీ ఫ్లాప్ అయ్యి హరీష్ శంకర్ కి మరో సినిమా దొరకకపోతే… ఏం పర్లేదు, ఇంకో కథ చేసుకోని రా, సినిమా చేద్దాం అని కాన్ఫిడెన్స్ ఇచ్చాడు రవితేజ. అక్కడి నుంచి మిరపకాయ్ సినిమా బయటకి వచ్చింది. సూపర్ హిట్ అయిన ఈ మూవీ తర్వాత రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా పడలేదు. మరి రవితేజతో హ్యాట్రిక్ సినిమా కోసం హరీష్ శంకర్ ఎలాంటి కథని రెడీ చేస్తున్నాడు? ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందా అనే విషయాలు తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 

Exit mobile version