Site icon NTV Telugu

Tiger Nageswara Rao : టైగర్ కి టైమొచ్చింది.. రెడీ అవ్వండి!

Tiger Nageshwar Rao

Tiger Nageshwar Rao

Tiger Nageswara Rao Latest Update: తన కెరీర్లో మంచి జోష్ మీదున్న మాస్ మహరాజ్ రవితేజ చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వర రావు. వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వర రావు సినిమాను రిలీజ్ చేయబోతున్నా ప్రమోషన్స్ అయితే ఇప్పటికే మొదలుపెట్టేశారు. రాజమండ్రిలో గ్రాండ్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అదిరిపోగా ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చేశారు. వచ్చే వారం అంటే ఆగస్టు 17న టైగర్ ఆక్రమణ మొదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో రవితేజ స్టువర్టుపురం గజ దొంగగా అయిన నాగేశ్వరరావు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా రవితేజ కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్‌ అండ్ ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది.

Who Movie: దయ తరువాత ‘హూ’ అంటున్న జేడీ!

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. గతేడాది రవితేజ హీరోగా ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా అనే మూడు సినిమాలు రిలీజ్ అయితే ధమాకా ఒక్కట్టే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కానీ ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన వాల్తేరు వీరయ్య అయితే మెగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక రవితేజ హీరోగా నటించి చివరగా వచ్చిన రావణసుర మాత్రం అందరినీ డిసప్పాయింట్ చేసింది. అందుకే టైగర్ నాగేశ్వరరావుతో హిట్ కొట్టాలని చూస్తున్న రవితేజ ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. మరి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో, ఆయనకి ఎంత వరకూ కలిసి వస్తుందో చూడాలి.

Exit mobile version