NTV Telugu Site icon

Raviteja: తగ్గేదేలే.. మాస్ మహారాజా సంభవం లోడింగ్!

Raviteja

Raviteja

సినిమా పోయింది.. ఇంటికెళ్లిపోతామా? సినిమా హిట్ అయింది.. తీయడం మానేస్తామా? సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. ఇంకో సినిమా చేయాల్సిందే! నేనింతే సినిమాలో రవితేజ చెప్పిన డైలాగ్ ఇది. అందుకే హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. గతేడాది మూడు సినిమాలతో థియేటర్లోకి వచ్చిన రవితేజ.. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలతో అలరించాడు. అందులో వాల్తేరు వీరయ్య హిట్, రావణాసుర ఫట్. అయితే ఏంటి మరో కొత్త సినిమాతో దూసుకొస్తున్నాడు మాస్ రాజా కాకపోతే ఈసారి బౌండరీలని దాటి పాన్ ఇండియా టచ్‌తో వస్తున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’.. దసరా టార్గెట్‌గా అక్టోబర్ 20న రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Read Also:CBSE Class 12 Results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ లింక్ ఇదే..

మాస్ మహారాజా సంభవం లోడింగ్… టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్, రవితేజ ఫ్యాన్స్ గర్వపడేలా ఉంటుందని చెబుతున్నారు. అతి త్వరలోనే ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే.. సినిమా రిజల్ట్‌తో సబంధం లేకుండా దూసుకుపోతున్న మాస్ రాజా.. భారీగా పారితోషికం పెంచేసినట్టు తెలుస్తోంది. టైగర్ నాగేశ్వర రావు తర్వాత ‘ఈగల్’ అనే మూవీ చేస్తున్నాడు రవితేజ. అలాగే కలర్ ఫొటో డైరెక్టర్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ కోసం రవితేజ ఏకంగా 25 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో… మాస్ రాజా బాక్సాఫీస్ స్టామినా చూసిన మేకర్స్… రవితేజ ఎంత అడిగినా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి టైగర్ నాగేశ్వర రావుతో పాన్ ఇండియా హిట్ కొడితే రవితేజ ముప్పై కోట్ల హీరో అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Show comments