NTV Telugu Site icon

Raviteja: రవితేజ నోటి దూల.. ఆ డైరెక్టర్ ను కల్లు తాగిన కోతి అంటూ

Raviteja

Raviteja

Raviteja: మాస్ మహారాజా రవితేజ ఎనర్జీ లెవల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో బయట కూడా అంతే యాక్టివ్ గా కనిపిస్తాడు. అయితే కొన్ని సార్లు ఆ యాక్టివ్ నెసే రవితేజను వివాదాల్లోకి నెడుతోంది అంటున్నారు అభిమానులు. రవితేజ ఏది మనసులో ఉంచుకోడు. అది ఎలాంటి విషయమైన ముఖం మీదే చెప్పుకొస్తాడు. ఖిలాడీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం డైరెక్టర్ పై కొన్ని అనుచిత కామెంట్స్ చేసి షాక్ ఇచ్చాడు. ఇక ఆ వివాదం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తాజాగా మరో డైరెక్టర్ పై రవితేజ నోరు జారాడు.

ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ధమాకా., త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచిన రవితేజ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే రవితేజకు మాస్ హిట్లు ఇచ్చిన బాబీ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి లతో కలిసి మాస్ మహారాజా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. అందులో రవితేజ ధమాకా డైరెక్టర్ గురించి కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడాడు. “నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రినాథరావు నక్కిన చేసిన డ్యాన్సులు అందరు చూసారుగా.. రెచ్చిపోయాడు.. అంటే కల్లు తాగిన కోతి ఉంటుంది చూశారా..? మొత్తం అటు ఇటు హహ్హాహ్ అంటూ నవ్వుతూ తిరిగాడు” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇది రవితేజ సరదాగా మాట్లాడి ఉండవచ్చు కానీ.. ఒక డైరెక్టర్ గురించి ఆయన లేనప్పుడు ఇలా వ్యంగ్యంగా మాట్లాడడం తప్పు అని పలువురు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.