Site icon NTV Telugu

Ravanasura: ఈరోజు సాయంత్రం ‘రావణుడు’ వస్తున్నాడు…

Ravanasura

Ravanasura

ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలు ఇచ్చాడు మాస్ మహారాజ రవితేజ. ముందెన్నడూ లేనంత జోష్ లో, ఇప్పటివరకూ చెయ్యనంత యాక్టివ్ గా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఫాన్స్ లో జోష్ నింపుతున్నాడు రవితేజ. డిసెంబర్ లో ధమాకా అయిపొయింది, జనవరి వాల్తేరు వీరయ్య వచ్చేసింది ఇక ఇప్పుడు ఏప్రిల్ లో ‘రావణాసుర’ టైం వచ్చింది. సుదీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రానున్న రావణాసుర మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. రావణాసుర టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడం, రావణాసుర థీమ్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో రావణాసుర సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ అంచనాలని పెంచూతు మేకర్స్ రోజుకో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూనే ఉన్నారు. హాలీవుడ్ యాక్షన్ మూవీ జాన్ విక్ ని గుర్తు చేసే రేంజులో రవితేజ సూటు బూటు వేసుకోని గన్ పట్టుకోని కనిపిస్తున్నాడు.

ఈ పోస్టర్స్ లో రవితేజ కనిపించినంత స్టైలిష్ గా ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో కనిపించలేదు. అందుకే యాక్షన్ సినిమాగా ప్రమోట్ అవుతున్న రావణాసురపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్లడానికి మేకర్స్ రావణాసుర ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4:05 నిమిషాలకి రావణాసుర ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ ట్రైలర్ బయటకి రావడం రావణాసుర సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం రెండూ ఒకటే సారి జరుగుతాయి. భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాతో రవితేజ హ్యాట్రిక్ కొడతాడేమో చూడాలి. దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్, పూజితా పోన్నాడా కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ మూవీలో అక్కినేని సుశాంత్ కూడా నటిస్తున్నాడు.

Exit mobile version