NTV Telugu Site icon

Ravanasura: ఇప్పటివరకూ రవితేజని హీరోగా చూశారు… ఇకపై ‘రావణాసుర’గా చూస్తారు

Ravanasura

Ravanasura

మాస్ మహారాజా రవితేజ అనగానే హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్, జోష్ ఫుల్ డైలాగులు, స్కై టచింగ్ హీరోయిజం గుర్తొస్తుంది. ఈసారి మాత్రం అలా కాదు, ఇప్పటివరకూ హీరోని చూశారు ఈసారి మాత్రం విలన్ ని చూడండి అంటూ రవితేజ ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. రవితేజ ఇప్పటికే రెండు 100 కోట్ల సినిమాలు చెయ్యడంతో ‘రావణాసుర’పై అంచనాలు మరింత పెరిగాయి. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి, వాటిని క్రాస్ చేసి హిట్ కొడతాను అనే నమ్మకం ఆడియన్స్ లో కలిగిస్తే రవితేజ ‘రావణాసుర’ టీజర్ బయటకి వచ్చింది. సుధీర్ వర్మ స్టైల్ ఆఫ్ మేకింగ్ కి, రవితేజ స్క్రీన్ ప్రెజెన్స్ కలవడంతో రావణాసుర టీజర్ సూపర్బ్ గా ఉంది. విజయ్ కార్తీక్ కెమెరా వర్క్, హర్షవర్ధన్-భీమ్స్ మ్యూజిక్, నవీన్ నూలి ఎడిటింగ్ స్టైల్ రావణాసుర టీజర్ ని స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా మార్చాయి. సుశాంత్, జయరామ్ ల లుక్ కొత్తగా ఉంది.

Read Also: Project K: యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ లో అమితాబ్ కి ప్రమాదం…

ముగ్గురు హీరోయిన్స్ లో ఒక్కరి లుక్ ని కూడా పూర్తి స్థాయిలో ప్రెజెంట్ చెయ్యలేదు కానీ కొంతమంది అమ్మాయిల డెడ్ బాడీస్ ని  మాత్రం క్లియర్ గా చూపించారు. చనిపోయింది హీరోయిన్లే అని చెప్పకుండా ఉంటే అది చాలు కానీ రవితేజ మాత్రం నెగటివ్ షెడ్ లో నెవర్ బిఫోర్ అనే రేంజులో ఉన్నాడు. స్టైలిష్ గా కనిపిస్తూనే నెగటివ్ షేడ్ ని రవితేజ క్యారీ చేసిన విధానం ఇంప్రెస్ చేసింది. ఇప్పటివరకూ కామెడి, సీరియస్ రోల్స్ లో మాత్రమే కనిపించిన రవితేజని విలనిష్ టచ్ ఉన్న రోల్ లో చూడడం కొత్తగా అనిపించడం గ్యారెంటీ. టీజర్ ఎండ్ లో “సీతని తీసుకోని వెళ్లాలి అంటే సముద్రం దాటితే సరిపోదు, ఈ రావణాసురుడిని కూడా దాటాలి” అనే డైలాగ్ రవితేజ క్యారెక్టర్ ని ప్రెజెంట్ చేస్తుంది. ఈ టీజర్ చూస్తుంటే రవితేజ 100 కోట్ల హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ అనిపిస్తుంది. మొత్తానికి నిమిషమున్నర ఉన్న టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రావణాసుర టీమ్, ఏప్రిల్ 7న ఏ రేంజ్ హిట్ అందుకుంటారు అనేది చూడాలి.

Show comments