మాస్ మహారాజ రవితేజ డిసెంబర్ నెలలో ధమాకా సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. తన ట్రేడ్ మార్క్ ఫన్ తో ఆడియన్స్ కి ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ధమాకా సినిమాతో రవితేజ మొదటిసారి వంద కోట్ల క్లబ్ లోకి చేరాడు. అసలు అంచనాలు లేకుండా వచ్చిన ధమాకా మూవీ రిజల్ట్ ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చింది. ధమాకా రిలీజ్ అయిన నెల రోజులలోనే వాల్తేరు వీరయ్య సినిమాలో లెన్తీ క్యామియో ప్లే చేశాడు రవితేజ. మెగాస్టార్ చిరంజీవి, రవితేజల మాస్ కాంబినేషన్ ని చూడడానికి ఫాన్స్ థియేటర్స్ కి క్యూ కట్టడంతో సంక్రాంతి బాక్సాఫీస్ కళకళలాడింది. వాల్తేరు వీరయ్య సినిమా కూడా రవితేజకి వంద కోట్లు తెచ్చిపెట్టింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలు తన ఖాతాలో వేసుకున్న రవితేజ హ్యాట్రిక్ హిట్ కోసం ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి వచ్చాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మతో కలిసి రవితేజ చేసిన ఈ ఎక్స్పరిమెంట్ అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించినట్లు లేదు.
పోస్టర్స్, టీజర్, ట్రైలర్ తో రావణాసుర ఒక థ్రిల్లర్ అనిపించేలా ప్రమోట్ చెయ్యడంతో ఫాన్స్ మాత్రమే రావణాసుర సినిమాకి వెళ్లాల్సి వచ్చింది. రెగ్యులర్ మూవీ లవర్స్ రవితేజ సినిమాకి కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు. ఈ విషయాన్ని మర్చిపోయి రవితేజ సినిమా చేసిన ప్రతిసారి బ్యాడ్ రిజల్ట్ ని ఫేస్ చేశాడు. ఈసారి కూడా దాదాపు అలాంటిదే జరగబోతున్నట్లు ఉంది. రావణాసుర సినిమా ప్రీరిలీజ్ థియేటర్ బిజినెస్ 25 కోట్ల వరకూ చేసింది. ప్రస్తుతం రావణాసుర సినిమా ఈ మర్చ్క్ ని రీచ్ అవ్వాలి అంటే ఇంకో 10-11 కోట్ల వరకూ రాబట్టాల్సి ఉంది. ఇప్పుడున్న టాక్ అండ్ బుకింగ్స్ ట్రెండ్స్ చూస్తుంటే రావణాసుర సినిమా మహా అంటే ఇంకో యాబై లక్షల వరకే కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎంత లేదన్నా రావణాసుర సినిమా లీస్ట్ కేస్ లో 10 కోట్ల నష్టాన్ని మిగిలించే ఛాన్స్ ఉంది.