NTV Telugu Site icon

Writer Padmabhushan: నిన్న మహేష్ నేడు రవితేజ.. ‘కలర్ ఫోటో’ హీరో దశ తిరిగినట్టే

Raviteja

Raviteja

Writer Padmabhushan: చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో ఎవరికి తెలియదు. ఎవరి అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో ఎవ్వరం చెప్పలేం. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్లు అయిన వారు ఉన్నారు.. ఒక్కో మెట్టు ఎదుగుతూ మంచి విజయాలను అందుకొని అందరి దృష్టిలో పడినవారు ఉన్నారు. ప్రస్తుతం హీరో సుహాస్ రెండో కేటగిరికి చెందిన వాడని చెప్పొచ్చు. ఛాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానెల్ లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ.. కలర్ ఫోటో అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా జాతీయ అవార్డును అందుకోవడంతో సుహాస్ పేరు టాలీవుడ్ మొత్తం మారుమ్రోగిపోయింది. హీరోగానే కాకుండా విలన్ గా, కమెడియన్ గా కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక సుహాస్ మొట్ట మొదటిథియేటర్ రిలీజ్ అంటే.. రైటర్ పద్మభూషణ్ అనే చెప్పాలి. ప్రశాంత్ షణ్ముఖ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత శుక్రవారం రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాను వీక్షించి మంచి రివ్యూలు ఇస్తున్నారు.

నిన్నటికి నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను వీక్షించి చిత్ర బృందాన్ని స్వయంగా కలిసి అభినందించాడు. ఇక తాజాగా మాస్ మహారాజా రవితేజ ట్విట్టర్ వేదికగా రైటర్ పద్మభూషణ్ సినిమాను ప్రశంసించాడు. ” సుహాస్.. ఏం నటించావ్.. రైటర్ పద్మభూషణ్ సినిమాను నేను ఎంతో ఎంజాయ్ చేశాను. సినిమాకు క్లైమాక్స్ గుండెవంటిది. నాకు చాలా బాగా నచ్చింది. అందరు చూడాల్సిన సినిమా. నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర.. ఇలాంటి రిఫ్రెషింగ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు కుడోస్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాతో సుహాస్ దశ తిరిగినట్లే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ముందు సుహాస్ ఎలాంటి ఛాన్స్లు కొట్టేస్తాడో చూడాలి.