NTV Telugu Site icon

Raviteja: పోస్టర్ అదిరింది మావా… బచ్చన్ సాబ్ మస్త్ ఉన్నాడు

Mister Bachhan

Mister Bachhan

మాస్ మహారాజా రవితేజ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇస్తూ రవితేజ లేటెస్ట్ గా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని బయటకి వదిలారు. ఈ పోస్టర్ లో రవితేజ ఈ మధ్య ఎప్పుడూ కనిపించనంత స్టైలిష్ గా ఉన్నాడు. హిందీలో అజయ్ దేవగన్ నటించిన సూపర్ హిట్ సినిమా రైడ్. ఈ మూవీని తెలుగులో హరీష్ శంకర్ డైరెక్ట్ రీమేక్ చేస్తున్నాడు. ఇటీవలే గపూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. మిస్టర్ బచ్చన్… అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ హరీష్ శంకర్ ఎలాంటి హిట్ అందుకుంటారు అనేది చూడాలి. మిస్టర్ బచ్చన్ హిట్ అవ్వడం రవితేజ ఎంత ముఖ్యమో హరీష్ శంకర్ కి కూడా అంతే ముఖ్యం. చాలా రోజులుగా డైరెక్షన్ కి దూరంగా ఉన్న హరీష్ శంకర్, ఉస్తాద్ సినిమా చేస్తున్నాడు అనగానే ఈసారి హిట్ కొట్టడం గ్యారెంటీ అనుకున్నారు.

ఊహించని విధంగా ఉస్తాద్ డిలే అవ్వడంతో మిస్టర్ బచ్చన్ ట్రాక్ లోకి వచ్చింది. హరీష్ శంకర్ హిట్ కొట్టి చాలా రోజులు అయ్యింది, నెక్స్ట్ సినిమా షూటింగ్ కి కూడా టైమ్ పడుతుంది. ఇలాంటి సమయంలో హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాతో హిట్ కొట్టాల్సిందే. రవితేజ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా హరీష్ శంకర్ నిలబెట్టాల్సి ఉంది. మిరపకాయ్ తో రవితేజతో హిట్ కొట్టిన హరీష్ శంకర్… మాస్ మహారాజ బర్త్ డే రోజున ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. “నా ఆకలి తీర్చావు నా ఆనందాన్ని పంచుకున్నావు నా ఆవేశాన్ని అర్థం చేసుకున్నావు నా ఆశలకి ఆయువు పోశావు …. ఎంత చెప్పినా ఏమి చేసినా తక్కువే ఎన్నో జన్మలకు ఊపిరి పోసిన నీకు “జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య “ Love you forever” అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేసాడు.

 

https://twitter.com/harish2you/status/1750592544415846794