Site icon NTV Telugu

Dhamaka: క్రాక్ రికార్డులకి ‘ధమాకా’ చెక్…

Raviteja

Raviteja

మాస్ మహారాజ రవితేజ హిట్ కొడితే దాని సౌండ్ ఎలా ఎలా ఉంటుందో ‘క్రాక్’ మూవీ నిరూపించింది. గతేడాది జనవరి 9న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీలో ‘పోతురాజు వీరశంకర్’ అనే పోలిస్ పాత్రలో రవితేజ కనిపించాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. కరోన తర్వాత ఆడియన్స్ థియేటర్ కి వస్తారో రారో అనే డౌట్ కి ఎండ్ కార్డ్ వేసి, సరైన సినిమా పడితే ఆడియన్స్ ఆటోమాటిక్ గా థియేటర్స్ కి వస్తారు అని ప్రూవ్ చేసిన సినిమా ‘క్రాక్’. రవితేజకే కాదు కరోనా కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీకి కూడా ఆక్సిజన్ లాంటి హిట్ ఇచ్చిన క్రాక్ మూవీ బాక్సాఫీస్ దగ్గర 70కోట్లు రాబట్టింది. ఏడాది తిరగకుండానే ఈ కలెక్షన్స్ ని బ్రేక్ చెయ్యడానికి రవితేజ ‘ధమాకా’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు.

Read Also: Raviteja: మాస్ మహారాజా నట వారసుడు టాలీవుడ్ ఎంట్రీ..?

క్రాక్ సినిమా మొదటి మూడు రోజుల్లో 23 కోట్లు రాబడితే, ధమాకా సినిమా అదే మూడు రోజుల్లో 32 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. క్రాక్ మూవీ ఫస్ట్ వీకెండ్ కి 40   కోట్లు రాబట్టింది, ఈ నంబర్ ని ధమాకా సినిమా మరో ఇరవై నాలుగు గంటల్లో బ్రేక్ చెయ్యడానికి సిద్ధంగా ఉంది. ఓవరాల్ గా క్రాక్ రాబట్టిన 70 క్రోర్స్ కలెక్షన్స్ ని కూడా ధమాకా సినిమా రీచ్ అవ్వడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు. సంక్రాంతి వరకూ పెద్ద సినిమాలేవి రిలీజ్ కావట్లేదు కాబట్టి ధమాకా సినిమా థియేటర్ రన్ కంటిన్యు అవుతుంది. ప్రస్తుతం ధమాకా మైంటైన్ చేస్తున్న థియేటర్ కౌంట్ లో డ్రాప్ కనిపించకపోతే, కలెక్షన్స్ లో కూడా డ్రాప్ కనిపించే అవకాశం లేదు. ఇప్పుడున్న బాక్సాఫీస్ ట్రెండ్ ని బట్టి చూస్తే క్రాక్ మూవీ ఫుల్ రన్ లో రాబట్టిన కలెక్షన్స్ ని ధమాకా సినిమా సెకండ్ వీక్ ఎండ్ అయ్యే లోపే రాబట్టే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ‘ధమాకా’ సినిమాతో రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టినట్లే.

Read Also:Sankranthi Movies: ‘వారిసు’కే ఎక్కువ థియేటర్స్… మూడు సినిమాల ప్రీబుకింగ్స్ స్టార్ట్!

Exit mobile version