మాస్ మహారాజా రవితేజ బర్త్ డే నేడు. ఈ ఎనర్జిటిక్ హీరో ఈరోజు 54వ ఏట అడుగుపెట్టనున్నారు. ఇక ‘క్రాక్’ హిట్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఆయన ఖిలాడీ, రావణాసుర, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా వంటి ఇతర చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Read Also : ధనుష్ “సార్” నుంచి సినిమాటోగ్రాఫర్ అవుట్
ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయా సినిమాల మేకర్స్ కొన్ని అప్‌డేట్‌లను విడుదల చేసి మాస్ మహారాజా అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఈరోజు సాయంత్రం వరకు వరుసగా రవితేజ రానున్న చిత్రాల నుంచి అప్డేట్స్ ప్లాన్ చేశారు. ‘ఖిలాడి’ నుండి ‘ఫుల్ కిక్కు’ అనే పాట ఈరోజు ఉదయం 10:08 గంటలకు విడుదల కానుంది. ఆ తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’ సినిమాల అప్‌డేట్‌లు వరుసగా మధ్యాహ్నం 12:06 గంటలకు, సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయనున్నారు.
అంతేకాకుండా రవితేజ నటిస్తున్న ‘రావణాసురుడు’, ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి బర్త్ డే పోస్టర్స్ విడుదల కానున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇక మాస్ మహారాజా పుట్టిన రోజును మరింత ప్రత్యేకంగా చేసేందుకు మరో ‘మెగా’ అనౌన్స్‌మెంట్ కూడా రానుందని సమాచారం.
