Ravi Teja to bring First Original IMAX Officially in ART Cinemas at Hyderabad: మాస్ మహారాజా రవితేజ ఒక పక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా మారి సినిమాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నిర్మాణంలో సుందరం మాస్టర్ సినిమాతో పాటు చాంగురే బంగారు రాజా అనే సినిమాలు తెరకెక్కాయి. ఇక మరో పక్క హీరోగా కాకుండా మెగాస్టార్ చిరంజీవి లాంటి బడా స్టార్ పక్కన మల్టీస్టారర్ చేయడానికి కూడా ఆయన వెనకాడడం లేదు. అలా చేసిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ప్రభాస్ బాటలో పయనిస్తూ రవితేజ ఒక థియేటర్ నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి అనుభవం సంపాదించిన ఏషియన్ సంస్థ ఇప్పుడు మల్టీప్లెక్స్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలలో వారికి మల్టీప్లెక్స్ లు ఉన్నాయి.
Operation Valentine: 16 స్క్రిప్ట్‌లను కాదని వరుణ్ తేజ్ ‘ఆపరేషన్’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రక్షణ శాఖ
అయితే ఏదో ఒక హీరోతో పార్ట్నర్ షిప్ చేసి మల్టీప్లెక్స్ నిర్మిస్తే క్రేజ్ రావడంతో పాటు తమ వ్యయం కూడా కొంత తగ్గుతుందని భావించి ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలతో కలిసి కొన్ని మల్టీప్లెక్స్ లను మొదలుపెట్టింది. అందులో భాగంగానే రవితేజతో కలిసి దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఒక మల్టీప్లెక్స్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు హైదరాబాదులోనే ఫస్ట్ ఒరిజినల్ ఐమాక్స్ ని ఈ థియేటర్లో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఐమాక్స్ కార్పొరేషన్ తో దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయి అగ్రిమెంట్లు కూడా జరిగిపోయినట్లు తెలుస్తోంది. గతంలో ప్రసాద్ ఐమాక్స్ లో ఐమాక్స్ స్క్రీన్ ఉండేది. కానీ తదనంతర కాలంలో దాన్ని తొలగించారు. ఇప్పుడు ఏషియన్ రవితేజ థియేటర్స్ నిర్వాహకులు చెబుతున్న దాన్నిబట్టి ఇది హైదరాబాదుకి ఫస్ట్ ఒరిజినల్ ఐమాక్స్ కానుందని చెబుతున్నారు.
