హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ (90) నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న అయన నిన్న రాత్రి రవితేజ నివాసంలో ఆయన కన్నుమూసారు. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ వృత్తిరీత్యా ఫార్మసిస్ట్ గా పని చేసేవారు. ఆయనకు రవితేజ,రఘు, భరత్ రాజు అనే ముగ్గురు కుమారులు.
మరోవైపు రవితేజ రీల్ ఫాదర్ కోట శ్రీనివాసరావు రెండు రోజుల క్రితం కన్నుమూసారు. రవితేజ, కోట శ్రీనివాసరావు తండ్రి కొడుకులుగా ఇడియట్ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ సినిమాలో వారి మధ్య బాండింగ్ రియల్ ఫాదర్ అండ్ సన్ లాగా ఉంటుంది. కోట మరణంతో రవితేజ చాలా ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా కోటకు సంతాపం తేలుపుతు ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు రవితేజ. రెండు రోజులు క్రితం రీల్ ఫాదర్ కోట శ్రీనివాసరావు నేడు రియల్ ఫాదర్ భూపతి రాజు రాజగోపాల్ శాశ్వతంగా దూరమవడంతో రవితేజ శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ కష్ట సమయంలో మీ వెంట మేము ఉన్నామని ధైర్యంగా ఉండాలని రవితేజకు మద్దతుగా ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
