Ravi Teja New Movie Update : మాస్ మహరాజ్ ను లైన్లో పెట్టిన ‘సింగం’ డైరెక్టర్… ‘ఇరుముడి’ తర్వాత ఇదే ప్రాజెక్ట్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Teja New Movie Update : ‘ఇరుముడి’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న రవితేజ, మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో ‘సింగం’ ఫ్రాంచైజీతో దర్శకుడు హరితో ఆయన చేతులు కలపనున్నారనే ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్ గా దర్శకుడు హరి ఇటీవల రవితేజను కలిసి ఒక లైన్ స్టోరీ వినిపించారని తెలుస్తోంది. కథ రవితేజకు నచ్చిందని, ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వేగవంతమైన కథనం, మాస్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాను కలిపి ప్రేక్షకులను ఆకట్టుకునే హరి స్టైల్‌కు రవితేజ ఎనర్జీ జత అయితే అది మరో పవర్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తపై రవితేజ గానీ, దర్శకుడు హరి గానీ అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం ఇది ఇంకా చర్చల దశలోనే ఉంది.
రవితేజ ఇప్పుడు పూర్తిగా ‘ఇరుముడి’ చిత్రంపైనే దృష్టి పెట్టాడు. 2026 ఆగస్టు 21న విడుదల కానున్న ఈ సినిమా ఆయన కెరీర్లో కీలక చిత్రంగా మారుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో రవితేజ ఒక తండ్రి పాత్రలో కనిపించారు. తన కూతురి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే వ్యక్తిగా ఆయన పాత్రను చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ విజయాలు సాధించకపోవడంతో ‘ఇరుముడి’పై రవితేజ కూడా ఎక్కవ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి వంటి నటీనటులు కూడా ఉన్నారు.
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
రవితేజ చివరిగా ‘భర్త మహాసయులకు విజ్ఞప్తి’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కనిపించారు. ఈ సినిమా ప్రస్తుతం ZEE5 ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇప్పుడు అభిమానుల దృష్టి పూర్తిగా ‘ఇరుముడి’పై ఉంది. అదే సమయంలో హరితో కాంబినేషన్ నిజమైతే, మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు అది మరో భారీ సర్ప్రైజ్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవితేజ ఎనర్జీకి హరి మాస్ టచ్ కలిస్తే తెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
OTR: వివాదాస్పదంగా తంబళ్ళపల్లె టీడీపీ ఇన్చార్జి వైఖరి..
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!