Site icon NTV Telugu

రవితేజ లక్ మాములుగా లేదుగా… అట్టర్ ఫ్లాప్ జస్ట్ మిస్ !

Raviteja

Raviteja

మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ మూవీ “ఖిలాడి” విడుదలకు సిద్ధం అవుతోంది. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో “రామారావు ఆన్ డ్యూటీ” అనే మరో సినిమా షూటింగ్ లో ప్రస్తుతం రవితేజ బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మాస్ మహారాజా సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఇటీవల విడుదలైన ఓ భారీ ఫ్లాప్ సినిమా నుంచి రవితేజ తప్పించుకున్నాడని, ఈ ఏడాది ఆయన లక్ బాగుందని అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Read Also : ‘అఖండ’ రోరింగ్ హిట్… ఫస్ట్ డే కలెక్షన్స్

ఆ వార్తల ప్రకారం రీసెంట్ గా విడుదలైన ‘అనుభవించు రాజా’ సినిమా పరాజయం నుంచి రవితేజ తప్పించుకున్నాడని ఇండస్ట్రీలో తాజా టాక్. రాజ్ తరుణ్, ఖషీష్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ స్క్రిప్ట్‌తో దర్శకుడు రవితేజను మొదట సంప్రదించినట్లు సమాచారం. అయితే రవితేజ ఈ సినిమాని తిరస్కరించడంతో దర్శకుడు రాజ్ తరుణ్‌ని సంప్రదించి ఈ చిత్రానికి ఒప్పించాడట. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 26న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Read Also : థై స్లిట్ డ్రెస్ షోలో మిల్కీ బ్యూటీ మెరుపులు… పిక్స్ వైరల్

కాగా రవితేజ చివరి చిత్రం ‘క్రాక్’ ఈ ఏడాది మొదట్లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలతో ప్రేక్షకులను అలరించే పనిలో పడ్డాడు రవితేజ. ఆయన వరుస సినిమాలను చూస్తుంటే ఈ సమయంలో కామెడీ కేపర్‌, లేదా విలేజ్ డ్రామాలు చేసే మూడ్‌లో రవితేజ లేనట్టుగా కన్పిస్తోంది. ‘అనుభవించు రాజా’ను తిరస్కరించడానికి అది ఒక కారణం కావచ్చు. ఏదైతేనేం అదృష్టవశాత్తూ ఒక ఫ్లాప్ మూవీ నుంచి మా హీరో తప్పించుకున్నాడు అనుకుంటున్నారు రవితేజ ఫ్యాన్స్.

Exit mobile version