Mass Jathara : రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. దీన్ని రవితేజ 75వ సినిమాగా తీసుకొస్తున్నారు. ఈ సినిమాను భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ధమాకాలో రవితేజతో నటించిన శ్రీలీల నటిస్తోంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.
Read Also : Baby Movie Team : ఆనంద్, వైష్ణవికి వారితో గొడవ.. సద్దుమణిగినట్టేనా..?‘
ఈ మూవీ నుంచి ‘ఓలే ఓలే’ అంటూ సాగే పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లోనే మూవీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఆగస్టు 27న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మూవీ కూడా రేస్ లోకి వచ్చేసింది. ప్రమోషన్లకు ఎక్కువ సమయం లేకపోవడంతో సోమవారం ఉదయం 11.08 గంటలకు పూర్తి సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు.
