మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఈ ఏడాది మొదట్లో “క్రాక్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు ఫుల్ జోష్ తో సినిమాలు చేస్తున్నాడు. రవితేజ తదుపరి యాక్షన్ డ్రామా “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మరోవైపు “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రంతో షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ నటించబోతున్నాడు అనే వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Read Also : అన్ని భాషల్లోనూ బన్నీ మాటే!
రీసెంట్ శ్రీను వైట్లతో రవితేజ చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల రవితేజను కలిసిన శ్రీనువైట్ల రవితేజతో కలిసి పని చేయాలనే కోరికను వ్యక్తపరిచాడట. ఈ చర్చలు కార్యరూపం దాల్చితే వారిద్దరి కాంబినేషన్లో ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో దుబాయ్ శ్రీను, వెంకీ సినిమాలు వచ్చాయి. ఇదిలా ఉండగా శ్రీను వైటల్ ప్రస్తుతం “డి అండ్ డి” సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
