Site icon NTV Telugu

Raviteja: రవితేజ ఖాతాలో వరుసగా రెండు 100 కోట్ల చిత్రాలు

Raviteja

Raviteja

Raviteja:చిత్ర పరిశ్రమలో హీరోలకు అప్ అండ్ డౌన్స్ సహజం. వరుసగా నాలుగైదు సినిమాలు ప్లాఫ్ అయినా ఆ తర్వాత వచ్చే ఒక్క హిట్ తో మరో రెండేళ్ళు సర్వైవ్ కావచ్చు. అందుకు తాజా ఉదాహరణే రవితేజ. ఇటీవల కాలంలో వరుస పరాజయాలతో వెనుక బడ్డ రవితేజ ‘క్రాక్’తో ఒక్క సారిగా రేస్ లోకి వచ్చాడు. ఆ తర్వాత రెండు ప్లాఫ్స్ ఎదురైనా మళ్ళీ డిసెంబర్ విడుదలైన ‘ధమాకా’తో తనకి తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఔట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’తో మాస్ మహారాజా తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో కూడా చేరాడు. ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ తో నిర్మాతలు భారీ లాభాలను అందుకున్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతికి రవితేజ ఖాతాలో మరో పెద్ద హిట్ పడింది.

Read Also:Military Threat: చైనా తర్వాత అమెరికా నుంచే భారత్‌కు ముప్పు.. సర్వేలో భారతీయుల అభిప్రాయం

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజ కీలక పాత్రలో మెరిశాడు. ఈ పాత్ర సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. ఈ సినిమా సైతం వందకోట్ల వసూళ్ళను సాధించి రెండు వందల కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇలా కేవలం 2 నెలల్లో రవితేజ ఎకౌంట్లో రెండు వంద కోట్ల సినిమాలు పడటం గమనార్హం. దీంతో రవితేజ రాబోయే సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రవితేజ సైతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్‌ లో ఉన్నాడు. రవితేజ నటించిన ‘రావణాసుర’ షూటంగ్ పూర్తి కావచ్చింది. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’తో తొలి సారి పాన్ ఇండియా రిలీజ్ కి వెళ్ళబోతున్నాడు. మరి రవితేజ ఈ వంద కోట్ల వసూళ్ళను రాబోయే సినిమాలతోనూ కొనసాగిస్తాడేమో చూడాలి.

Read Also: Mukarram Jah: హైదరాబాద్ చేరుకున్న నిజాం ప్రిన్స్ ముకర్రమ్ మృతదేహం

Exit mobile version