టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఎప్పటిలాగే మళ్లీ సూటిగా, స్ట్రాంగ్‌గా మాట్లాడాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, తన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, టైమింగ్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న రవితేజ.. ఇప్పటికీ తనదైన స్టైల్‌లోనే ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అయితే, ఇటీవలి కాలంలో ఆయన సినిమాలు ఒకే రకంగా, రొటీన్‌గా వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విటర్‌లో కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ తాజాగా ఇచ్చిన సమాధానం మాత్రం కౌంటర్ షాట్‌లా మారింది.
Also Read : Hansika : ఇంటి పేరు మార్పుతో మరింత చెలరేగిన విడాకుల రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన హన్సిక
రవితేజ మాట్లాడుతూ.. “ట్విటర్ అంటే నెగెటివిటీతో నిండిపోయిన ప్లాట్‌ఫారమ్. అక్కడి వాళ్లు ఎక్కువగా విమర్శలు చేస్తారు కానీ థియేటర్‌కి మాత్రం రారు. నేను సీరియస్ గానీ, కొత్తగా ఏదైనా ప్రయత్నించినప్పుడు వాళ్లు ఆ సినిమాలను ప్రోత్సహించరు. ‘గీతాంజలి’లాంటి సినిమాలు చేసినా కూడా అదే పరిస్థితి. కానీ కమర్షియల్ సినిమాలు చేస్తేనే బాక్సాఫీస్ బజ్ వస్తుంది. ఆ సినిమాలు సులభంగా చేయలేం, వాటికి కూడా సెన్స్, బలమైన ఎమోషన్ ఉండాలి” అని స్పష్టంగా చెప్పారు. తన సినిమాలపై వస్తున్న విమర్శలకు కూడా రవితేజ ఓ లైన్‌లో సమాధానం ఇచ్చాడు.. “నేను ఏం చేసినా ట్విటర్ మేధావులు కామెంట్ చేయకుండా ఉండరు. వాళ్ల పని అదే. కానీ నేను నా పని చేస్తూనే ఉంటాను. నాకు థియేటర్‌లో ఆనందం ఇచ్చే ప్రేక్షకులే ముఖ్యం” అన్నారు.
అదే సమయంలో, ఓటీటీ యుగం వల్ల కొంతమంది ఆడియన్స్ థియేటర్ అనుభూతిని మర్చిపోయారని కూడా చెప్పారు రవితేజ.. “కరోనా తర్వాత ఓటీటీ కంటెంట్‌కి అలవాటు పడిన కొంతమంది ప్రేక్షకులు ఇప్పుడు పెద్ద తెరపై సినిమా చూడాలన్న ఆసక్తిని కోల్పోయారు. కానీ నిజమైన సినిమా మజా మాత్రం థియేటర్‌లోనే ఉంటుంది” అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రవితేజ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అభిమానులు “ఇదే మాస్ రాజా స్టైల్.. ఎవరికి భయపడడు, నేరుగా మాట్లాడతాడు” అంటుంటే, మరికొందరు “అతనిలోని ఆ ఎనర్జీ, కాన్ఫిడెన్స్‌నే ఆయన స్పెషల్” అంటూ సపోర్ట్ చేస్తున్నారు.
