Site icon NTV Telugu

Ravi Teja:మీ ప్రేమ దీవెనలు ఎప్పుడు ఇలాగే ఉండాలి : రవితేజ 

Raviteja

Raviteja

టాలీవుడ్ మాస్‌ మహారాజా రవితేజ సినిమాలంటే కామెడీ, యాక్షన్‌, రొమాన్స్ అని ఉంటాయి. ఫ్యామిలీ ఎలిమెంట్లు కథని బట్టి ఒక్కోటి యాడ్‌ అవుతూ ఉంటాయి. కొంత సెంటిమెంట్‌ కూడా తోడవుతుంది. ఇలా తన ప్రతి ఒక సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఫుల్‌ మీల్స్ పెడుతుంటారు రవితేజ. ప్రధానంగా ఎంటర్టైన్‌మెంట్‌, మాస్‌ ఎలిమెంట్లకి కొదవ ఉండదు. అలా వచ్చిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. కానీ ఈ మద్యకాలంలో ట్రాక్‌ తప్పాడు రవితేజ. తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ని వదిలేసి యాక్షన్‌ సినిమాల వెంట పరిగెడుతూ..ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు. కానీ అవన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఇప్పుడు తిరిగి తన ఫామ్ లోకి తను వచ్చింనట్లున్నాడు..

Also Read: Deepika Padukone : ఏకవర్ణ రూపంలో అందరిని ఆశ్చర్యపరిచిన దీపికా పదుకొణె

తాజాగా ఆయన నటిస్తున్న సినిమా ‘మాస్‌ జాతర’. భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ గ్లింప్స్ ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో పోలీస్‌గా కనిపించాడు రవితేజ.మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఆకర్షణీయంగా ఈ గ్లింప్స్‌ ను మలిచారు.పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాత రవితేజ‌ను గుర్తుచేశాయి. గ్లింప్స్ ఎండ్ లో రవితేజ అద్దంలో చూసుకుంటూ తనను తాను తిట్టుకునే సన్నివేశంతో ‘వెంకీ’ మూవీని గుర్తుచేసింది. భీమ్స్ సిసిరోలియో అందించిన బీజియం రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ఉండటం ఈ గ్లింప్స్‌ కు ప్రధాన బలంగా నిలిచింది.

అభిమానుల నుంచి ఈ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తాజాగా మాస్ రాజా ఎమోషనల్ ట్వీట్ చేశారు..‘ మీ ప్రేమ, దీవెనలు అందుకోవడం నిజంగా ఎంత ఆశీర్వాదం గా భావిస్తున్నానో మాటల్లో చెప్పలేను.. మీరు నా ఈ పుట్టిన రోజుకు తెలిపిన ఒక్కో విష్ నేను ఎంతో ఆరాధిస్తాను. మీ అందరికీ ధన్యవాదాలు, నా ప్రియమైన తమ్ముళ్లు మీకు ప్రత్యేక ధన్యవాదాలు..!’ అని రాసుకొచ్చాడు.

Exit mobile version