Site icon NTV Telugu

Ravi Basrur : సలార్ తర్వాత రవి బస్రూర్‌కు అంతర్జాతీయ ఆఫర్లు..!

Ravi Basur

Ravi Basur

దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్వరకర్త రవి బస్రూర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆదరణ పొందుతున్నారు. సెప్టెంబర్ 19న విడుదలకు సిద్ధమవుతున్న వీరచంద్రస చిత్రాన్ని తానే దర్శకత్వం వహించగా, ప్రస్తుతం ఆయనకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.

Also Read : RGV : రాయదుర్గంలో దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు..

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఉగ్రం, కెజిఎఫ్ సిరీస్, అలాగే  సలార్ సినిమాలకు ఆయన అందించిన సంగీతం విశేషంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా కెజిఎఫ్ లోని బ్యాగ్రౌండ్ ఆయనకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే సాలార్ లో మాత్రం బస్రూర్ కాస్త భిన్నంగా ప్రయోగాలు చేశారు. వెంటనే ఆకట్టుకునే విధంగా కాకుండా, క్రమంగా లోతైన అనుభూతి కలిగించేలా మ్యూజిక్‌ను డిజైన్ చేశారు. మొదట్లో కొంతమంది అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, ఆన్‌లైన్‌లో సినిమా అందుబాటులోకి రాగానే అందరూ సంగీతాన్ని ప్రశంసించారు. అయితే తాజాగా

సలార్ విడుదల తర్వాత అమెరికాలోని మూడు నుంచి నాలుగు నిర్మాణ సంస్థల నుంచి కాల్స్ వచ్చినట్టు బస్రూర్ చెప్పారు. “అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని సాలార్ కోసం సంగీతాన్ని రూపొందించాం. దాని వల్లే విదేశాల నుండి ఆఫర్లు రావడం చాలా ఆనందంగా ఉంది” అని ఆయన అన్నారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. కాగా  ప్రస్తుతం రవి బస్రూర్, ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ కమర్షియల్ యాక్షన్ డ్రామా కోసం సంగీతం అందిస్తున్నారు. తాత్కాలికంగా డ్రాగన్ అనే పేరుతో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కి ఇప్పటి వరకు మూడు–నాలుగు వెర్షన్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో, ఆయన సంగీతం మరోసారి సంచలనాన్ని సృష్టిస్తుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.

Exit mobile version