NTV Telugu Site icon

Raveena Tandon: నగ్న వీడియోలు పంపి టార్చర్ చేశాడు.. కెజిఎఫ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

Raveena

Raveena

Raveena Tandan: బాలీవుడ్ నటి రవీనా టాండన్ గురించి తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవలే కెజిఎఫ్ 2 చిత్రంలో రమీకా సేన్ గా ఆమె నటన అద్భుతం. ఈ ఒక్క పాత్ర ఆమెను పాన్ ఇండియా నటిగా నిలబెట్టింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన ఈ భామ తన జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది. 1990 లల్లో రవీనా స్టార్ హీరోయిన్.. ఆమె నటించిన ప్రతి సినిమా హిట్.. దీంతో ఆమెకు లెక్కలేనంతమంది అభిమానులు ఉండేవారు.

ఇక ఆ సమయంలో ఆమెను చూడడానికే వారి ఇంటి గేటువద్ద వందలమంది ఉండేవారట. అయితే అందరి అభిమానులు ఏమో కానీ తనకు ఒక అభిమానిని తలచుకొంటే మాత్రం వణుకు వచ్చేస్తోందని చెప్పుకొచ్చింది. ఒకానొక సమయంలో ఒక అభిమాని ఆమెకు రక్తంతో ప్రేమ లేఖలు, గిఫ్టులు, నగ్న చిత్రాలు, వీడియోలు కొరియర్ లో పంపేవాడట. ఆ తరువాత తన కుటుంబంతో బయటికి వెళ్ళినప్పుడు కారుపై రాయి విసిరి తాను బయటికి వచ్చి తనను ప్రేమను ఒప్పుకోమని కోరాడట. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిన ఆమె ఆ తరువాత అతడు తన ఇంటివద్ద రెక్కీ కూడా నిర్వహించడాన్ని, తన ప్రేమను ఒప్పుకోవాలని ఎన్నోరోజులు ఇంటి గేటు ముందే ఉన్నాడని చెప్పుకొచ్చింది. తన జీవితంలో అలాంటి భయానక సందర్భం ఇంకోటి ఎదుర్కోలేదని కూడా చెప్పుకొచ్చింది.

Show comments