NTV Telugu Site icon

Raveena: జర్నలిస్టుకు ఝలక్.. రవీనా టాండన్ 100 కోట్ల పరువు నష్టం దావా

Raveena Tandon

Raveena Tandon

Raveena Tandon Sends Defamation Notice: జూన్ 1న బాలీవుడ్ నటి రవీనా టాండన్ మద్యం మత్తులో ముగ్గురిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఓ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో రవీనా టాండన్ కారు ఒక వ్యక్తి తల్లిని ఢీకొట్టినట్టు, వారు నటిపై దాడి చేసినట్లు చూపబడింది. అయితే ముంబై పోలీసుల విచారణలో నటి కారు ఎవరినీ ఢీ కొట్టలేదని నిర్ధారించారు. ఈ వీడియో తనను తప్పుగా చూపించి, తాను కోరిననప్పటికీ తొలగించడానికి నిరాకరించిన ఒక జర్నలిస్టుపై నటి ఇప్పుడు 100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఈ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తికి పోలీసులు వెల్లడించిన సరైన వాస్తవాలను తెలియజేసినా ఆ వ్యక్తి రవీనా టాండన్ తన X (గతంలో ట్విట్టర్) ఖాతా నుండి వీడియోను తీసివేయమని అభ్యర్థిస్తూ లేఖ పంపాలని పట్టుబట్టాడు.

Maharaja OTT : ‘మహారాజ’ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది..?

దీంతో ఆగ్రహించిన రవీనా తన లాయర్ సనా రయీస్ ఖాన్ ద్వారా పరువు నష్టం నోటీసులు పంపింది. రవీనా తరపు న్యాయవాది సనా రయీస్ ఖాన్ మాట్లాడుతూ, ‘ఇటీవల, రవీనాను తప్పుడు, పనికిమాలిన ఫిర్యాదులో ఇరికించే ప్రయత్నం జరిగింది, సిసిటివి ఫుటేజ్‌లో స్పష్టంగా ఉంది. అయితే, ఎక్స్‌లో జర్నలిస్ట్ అని చెప్పుకునే ఒక వ్యక్తి ఈ సంఘటనపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాడు. తప్పుదారి పట్టించేలా చేస్తున్నాడు అని ఆమె పేర్కొంది. తనకు బహిరంగంగా అవమానం, మానసిక వేదన కలిగించే ఉద్దేశ్యంతో ఆ వ్యక్తి సోషల్ మీడియా, న్యూస్ పోర్టల్‌లలో నకిలీ వార్తలతో తన పరువు తీశాడని రవీనా టాండన్ తన నోటీసులో పేర్కొంది. “

Show comments