Site icon NTV Telugu

Pan India Movie: గ్రాండ్ గా మొదలైన ‘రావణ కళ్యాణం’

Ravana Kalyanam Movie Opening Ceremony

Ravana Kalyanam Movie Opening Ceremony

 

జాతీయ ఉత్తమ నటుడు బాబీ సింహా ప్రధాన పాత్రలో జెవి మధు కిరణ్ దర్శకత్వంలో నూతన చిత్రం ‘రావణ కళ్యాణం’ పూజా కార్యక్రమాలతో శనివారం గ్రాండ్ గా ప్రారంభమైయింది. నటుడు సత్యదేవ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బాబీ సింహా తనయుడు అర్జున్ క్లాప్ ఇవ్వగా, వి. వి. వినాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అరుణ్ కుమార్ సూరపనేని, కె. రేష్మి సింహా నిర్మిస్తున్నారు. ఆలూరి సురేష్, బాబీ సింహా సమర్పకులు. ఇందులో సందీప్ మాధవ్, రాజేంద్ర ప్రసాద్, దీపికా, శత్రు, మధునందన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అనంతరం బాబీ సింహా మాట్లాడుతూ, ” ‘రావణ కళ్యాణం’ చాలా ఆసక్తికరమైన కథ. ‘వంగవీటి, జార్జ్ రెడ్డి’ చిత్రాల్లో అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేసిన శాండీ (సందీప్ మాధవ్) ఈ చిత్రంలో భాగం కావడం మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. రధన్ సంగీతం ఈ చిత్రానికి మరో పెద్ద అసెట్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ‘జాతిరత్నాలు’ చిత్రంలో సిద్దం మనోహర్ విజువల్స్ నాకు చాలా ఇష్టం. ఈ కథకు ఆయన విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. శరత్ రవి, శత్రు, రాజేంద్ర ప్రసాద్ లాంటి అనుభవం గల నటులు కీలక పాత్రలు పోహిస్తున్నారు. కథ విన్నప్పుడు ఎంత ఎక్సయిట్ అయ్యానో, ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అంతే ఎక్సయిట్ అవుతారు” అన్నారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను దీపిక, రీతు గాయత్రి (పరిచయం), రాజ్‌కుమార్ కాసిరెడ్డి, మధునందన్, గుండు సుదర్శన్ , అనంత్ తదితరులు పోషిస్తున్నారు.

Exit mobile version