NTV Telugu Site icon

Bhagavanth kesari: ‘భగవంత్ కేసరి’లో రతిక… ఏ పాత్రలో నటించిందో తెలుసా?

Rathika Rose Thumb

Rathika Rose Thumb

Rathika Rose of Bigg Boss 7 Telugu in Bhagavanth Kesari: స్టార్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ నటించిన‌ భగవంత్ కేసరి దసరా సంధర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీ లీల కీలక పాత్రల్లో నటించాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఈ సినిమాలో తెలుగు అమ్మాయి, బిగ్‌బాస్ బ్యూటీ రతికా రోజ్ ఒక చిన్న పాత్రలో మెరిసింది. నిజానికి ఇది చిన్న పాత్రే అయినా రతికకు ఈ టైంలో మంచి ఛాన్స్ అనే చెప్పాలి. నిజానికి ఆమె కనుక బిగ్ బాస్ లోకి వెళ్లక పోయి ఉంటే ఆమె ఈ పాత్ర చేసిందని కూడా ఎవరూ గుర్తించేవారు కాదు కానీ బిగ్ బాస్ గుర్తింపుతో ఆమెను ఇట్టే గుర్తు పెట్టేస్తున్నారు జనాలు. ఇక ఈ సినిమా విషయంలో రతికా ఫ్యాన్స్ తెగ‌ ఖుషీగా ఉన్నారు.

Minister Jagadish Reddy: మోడీ దయా దాక్షిణ్యాల మీద గాంధీ కుటుంబం బతుకుతుంది

ఊహించని విధంగా సినిమాలో రతికాను చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు. ఇక రతికా రోజ్ ఈ సినిమాలో ఒక మహిళా మంత్రి పాత్రలో కనిపించింది. ఎక్కువ సేపు లేకపోయినా ఒకటి రెండు డైలాగులు కూడా ఆమెకు దక్కాయి. ఇక బిగ్ బాస్ 7 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయింది. హౌస్లోకి వెళ్లిన మెదట్లో రతిక చురకుగానే ఉండి గేమ్‌లు, టాస్క్‌లు కూడా బాగా ఆడేది. అయితే సింగర్‌ రాహుల్‌తో దిగిన ఫోటోలు బయటకు రావడం, దానిని సింపతీ యాంగిల్ కి వాడుకుంటుంది అనే ఆరోపణల నేపథ్యంలో ఆమెపై ప్రతీకూల ప్రభావం ఏర్పడింది. పల్లవి ప్రశాంత్‌తో ముందు ప్రేమగా ఉండి తరువాత వెన్నుపోటు పొడవడం, యావర్‌ విషయంలోనూ అలానే ఉండడం లాంటి కారణాలతో ఆమెను జనం ఎక్కువ రోజులు లోపల ఉంచలేదు.

Show comments