Site icon NTV Telugu

Animal Song: ఏందమ్మాయి ఇది… రౌడీ ఫ్యాన్స్ హర్ట్!

Animal Song

Animal Song

ఈసారి వైలెన్స్ మామూలుగా ఉండదని… యానిమల్ టీజర్ చూసిన తర్వాత అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే కేవలం వైలెన్స్ మాత్రమే కాదు రొమాన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉంటుందని ఒక్క పాటతో చెప్పేశాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్‌ రెడ్డి తర్వాత రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక హీరో హీరోయిన్లుగా యానిమల్ సినిమా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. డిసెంబర్ 1న యానిమల్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌లో.. రష్మిక, రణ్‌బీర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మామూలుగా ఉండదని చెప్పేశాడు సందీప్. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ చూస్తే… అర్జున్ రెడ్డికి మించి అనేలా ఉంది. అమ్మాయి అంటూ సాగే మెలోడి సాంగ్‌ను బ్యూటీఫుల్‌గా డిజైన్ చేశాడు సందీప్. మనన్ భరద్వాజ్‌ ఇచ్చిన ట్యూన్, సందీప్ మార్క్‌ మేకింగ్ అదిరిపోయింది. ఫ్యామిలీ అంతా చూస్తుండగానే… హీరో, హీరోయిన్ కి లిప్‌లాక్ సీన్ పెట్టిన సందీప్… ఇక ఇద్దరు సోలోగా కలిసినిప్పుడు ఇంకే రేంజ్ రొమాన్స్ చూపించబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఇల్లు, ప్రైవేట్‌ జెట్‌, కార్ ఇలా ప్రతి చోటా రణ్‌బీర్‌, రష్మిక లిప్‌లాక్‌తో కుమ్మేశారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూడ్డానికి బాగుంది కాని రష్మిక లిప్ లాక్‌ ఇప్పుడు రౌడీ ఫ్యాన్స్‌ హర్ట్ అయ్యేలా ఉంది. గీతా గోవిందం సినిమా నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక జోడి భలే ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే టాక్ కూడా ఉంది. ఎందుకంటే… ఇద్దరు కలిసి షికార్లు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతను చూసి ‘రేయ్ అది నా పిల్లా’ అన్నట్టుగా.. రౌడీ ఫ్యాన్స్ అంతా రష్మికను తమ హీరో పిల్ల అని ఫిక్స్ అయిపోయారు మరి ఇప్పుడు రౌడీ ఫ్యాన్స్‌ రష్మికను ఇలా చూసి తట్టుకుంటారా? లేదా? అనేది చూడాలి.

Exit mobile version