Site icon NTV Telugu

Rashmika: ఓ.. పాప.. ముందు వెనుక చూసుకోవాలిగా.. ఇప్పుడు అడ్డంగా దొరికావ్

Rashmika

Rashmika

Rashmika: సోషల్ మీడియా వచ్చాక నెటిజన్లను మోసం చేయడం అస్సలు కుదరడం లేదు. అసలు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట.. ఇంకో ఇంటర్వ్యూలో ఇంకో మాట అనే ఛాన్స్ కూడా లేదు. గూగుల్ తల్లి దయవలన అన్ని నెటిజన్లకు అందుబాటులో ఉంటున్నాయి. ఇక స్టార్లు ఎలాంటి చిన్న మాట తప్పుగా మాట్లాడినా నెటిజన్లు ఆ పాత వీడియోలను తోడి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు స్టార్లు ఏది మాట్లాడినా, ఏది చేసినా కొంచెం ముందు వెనుక చూసుకొని చేయాలి.. లేకపోతే ఇదుగో మన నేషనల్ క్రష్ లా అడ్డంగా దొరికిపోతారు. అంతలా రష్మిక ఏం చేసింది అనేగా.. ఏం చేయలేదు.. ఒక యాడ్ చేసింది.. అది కూడా మెక్ డోనాల్డ్స్ చికెన్ యాడ్.. హా అందులో తప్పేముంది.. స్టార్లు అన్నాకా యాడ్స్ చేయరా..? అంటారా..? చేస్తారు. అయితే ఇక్కడ రష్మిక చేసిన చికెన్ యాడ్ కు అమ్మడు అతను ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలకు ఎక్కడా పొంతన లేకుండా ఉండడంతో ప్రస్తుతం రష్మికను నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు.

V.V. Vinayak: అయ్యయ్యో.. గుర్తుపట్టలేకుండా మారిపోయిన మాస్ డైరెక్టర్

మెక్ డోనాల్డ్స్ చికెన్ యాడ్ లో శ్రీవల్లి.. నాన్ వెజ్ బర్గర్, చిల్లీ చికెన్, చికెన్ లాలీ పాప్స్ అంటూ లాగిస్తూ కనిపిస్తుంది. టేస్టీ, యమ్మీ అనుకుంటా చికెన్ ను నోరు ఊరించేలా తినేస్తుంది. ఇక ఇదే రష్మిక గతంలో నేను ప్యూర్ వెజిటేరియన్ గా మారాను అని, నాన్ వెజ్ పూర్తిగా మానేసినట్లు అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు మళ్లీ ఇదేంటి.. యాడ్ కోసం నాన్ వెజ్ తింటున్నావ్.. అంటే డబ్బు కోసం ఏదైనా చేస్తావా.. అని కొందరు.. అప్పుడు చెప్పిన మాటఏమైంది రష్మిక అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే మాట కెమెరా మూడ్ను అనేటప్పుడు కొంచెం చూసుకోవాలి అని ఇంకొందరు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version