Site icon NTV Telugu

ఫోర్బ్స్ జాబితాలో రశ్మికకు ఫస్ట్ ప్లేస్

Rashmika Mandanna tops list of 'most influential actors'

దక్షిణాది బ్యూటీ రశ్మిక క్రేజ్ మామూలుగా లేదు. దీనికి నిదర్శనమే ఫోర్బ్స్ జాబితాలో తొలి స్థానం. కన్నడ ‘కిరాక్‌ పార్టీ’తో పరిచయమైన రశ్మిక అతి తక్కువ సమయంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న రశ్మిక బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఇండియాలో అత్యంత ప్రభావవంతమైన నటీనటుల జాబితా రూపొందించింది ఫోర్బ్స్ సంస్థ. ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది రశ్మిక. ఈ రేసులో సమంత, విజయ్ దేవరకొండ, యష్‌, అల్లు అర్జున్ వంటి వారిని దాటి టాప్‌ ప్లేస్ లో నిలివటం విశేషం.

Read Also : ఆన్లైన్ టికెట్లు సమర్థిస్తా… : మంచు విష్ణు

దక్షిణాది తారలకు సోష‌ల్ మీడియాలో పెరిగిన ఫాలోవ‌ర్స్‌, లైక్స్, కామెంట్స్, వ్యూస్ ని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొని ఈ లిస్ట్ రూపొందించారు. ఇందులో రశ్మికకు 10 పాయింట్లకు 9.88 పాయింట్లు రాగా… 9.67తో విజ‌య్ దేవ‌ర‌కొండ రెండో స్థానంలో నిలిచాడు. 9.54తో క‌న్నడ స్టార్ య‌శ్ మూడో స్థానం దక్కించుకున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ తో ‘పుష్ప’ సినిమాలోనూ శర్వానంద్ తో ‘అడవాళ్ళు మీకు జోహార్లు’లోనూ నటిస్తున్న రశ్మిక, హిందీలో ‘మిషన్ మంజు, గుడ్ బై’ సినిమాలలో నటిస్తోంది.

Exit mobile version