ఆన్లైన్ టికెట్లు సమర్థిస్తా… : మంచు విష్ణు

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఆయన కుటుంబం, ప్యానల్ తో కలిసి తిరుమల వెళ్లారు. అక్కడ శ్రీవారి ఆశీస్సులు అందుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలోనే ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని సమర్థిస్తానని అన్నారు. ఇరు రాష్టాల సీఎం లను సినిమా ఇబ్బందిలపై కలుస్తాము అని చెప్పుకొచ్చారు. ఇక ‘మా’లో జరుగుతున్న వివాదం గురించి మాట్లాడుతూ మమ్మల్ని నిలదీస్తే హక్కు ప్రతి సభ్యుడికి ఉంటుంది. ఆయన అడిగినా, ఎవరడిగినా సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాము. మా నాన్న కోపం అందరికీ తెలుసు. పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత మాపై దాడి చేశారు అని వాళ్ళు చెప్పడం విడ్డూరంగా ఉంది” అని అన్నారు. ఇక పొలిటికల్ ఎంట్రీకి ఇది రూట్ మ్యాప్ అంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూ నాకు రాజకీయాలపై జీరో నాలెడ్జ్. చదువుతాను చూస్తాను అంతవరకే. ‘మా’లో మార్చాల్సింది చాలా ఉంది అంటూ కొన్ని కొత్త రూల్స్ తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.

Read Also : చిరంజీవి, మోహన్ బాబు ఫోన్ లో మాట్లాడుకున్నారు

Related Articles

Latest Articles