Rashmika Mandanna To Play Female Lead In Vikram Pa Ranjith Film: కన్నడ బ్యూటీ రశ్మికా మందణ్ణ ఏ ముహూర్తాన నేషనల్ క్రష్‌గా అవతరించిందో ఏమో తెలీదు కానీ.. అప్పట్నుంచి వరుసగా క్రేజీ ఆఫర్లు అందిపుచ్చుకుంటోంది. తన తోటి నటీమణుల్ని వెనక్కు నెట్టేస్తూ.. ఒకదాని తర్వాత మరొక జాక్‌పాట్స్ కొల్లగొడుతోంది. ఇప్పటికే రెండు పాన్ ఇండియా సినిమాలు, ఒక బైలింగ్వల్, మలయాళంలో ఓ చిత్రం చేస్తోన్న ఈ బ్యూటీ.. లేటెస్ట్‌గా మరో బంపరాఫర్ దక్కింది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. పా. రంజిత్, చియాన్ విక్రమ్ కాంబోలో రూపొందుతోన్న సినిమాలో కథానాయిక పాత్ర కోసం రశ్మికా మందణ్ణను సంప్రదించారట! అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. రశ్మికాని సంప్రదించడానికి ముందు మేకర్స్ పలువురు భామల్ని పరిశీలించారని, చివరికి రశ్మికా సెట్ అవుతుందనే ఉద్దేశంతో ఆమెని తీసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. దీనికితోడు పాన్ ఇండియా ఇమేజ్ ఉంది కాబట్టి, ఆ క్రేజ్ కూడా తమ సినిమాకి కలిసొస్తుందని మేకర్స్ భావిస్తున్నారట!
ఆల్రెడీ రశ్మికా తమిళ హీరో విజయ్ చేస్తోన్న ‘వారసుడు’ (బైలింగ్వల్) సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పుడు విక్రమ్ సినిమా కూడా కన్ఫమ్ అయితే, తమిళనాడులో కూడా రశ్మికాకి తిరుగు ఉండదు. కాగా.. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రశ్మికా, గీత గోవిందంతో ఎనలేని క్రేజ్ సంపాదించింది. అప్పట్నుంచే ఈ అమ్మడికి భారీ అవకాశాలు రావడం మొదలయ్యాయి. క్రమంగా నేషనల్ క్రష్ ట్యాగ్ కొల్లగొట్టేసి, ఇప్పుడు భారతీయ చిత్రసీమలో తిరుగులేని స్టార్డమ్‌ని ఎంజాయ్ చేస్తోంది.
