Site icon NTV Telugu

Rashmika Mandanna: సమంతపై రష్మిక సంచలన వ్యాఖ్యలు.. ఒక అమ్మలా రక్షించాలని ఉంది

Rashmika

Rashmika

Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. గతేడాది ఈ వ్యాధి గురించి సామ్ బయటపెట్టింది. ఈ విషయం తెలియడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే సమంత కోలుకొంటుంది. ఇక తాజాగా ఆమె గురించి కన్నడ బ్యూటీ రష్మిక సంచలన వ్యాఖ్యలు చేసింది. వారసుడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక, సామ్ గురించి చెప్పుకొచ్చింది.

“సమంత అద్భుతమైన మహిళ. ఆమె ముఖమే కాదు హృదయం కూడా అందమైనదే. ఆమె విషయానికి వస్తే నేను చాలా పోసిసివ్ గా ఉంటాను. ఇక ఆమె ఆరోగ్యం గురించి చెప్పాలంటే.. సామ్ ఎంతో ధైర్యంగా ఉండే మహిళ. ఈ విషయాన్ని ఆమె ప్రపంచానికి చెప్పకముందు ఎలా ఫీల్ అయ్యిందో నాకు తెలియదు.. కానీ, ఆమె ఇంత ధైర్యంగా బయటపెట్టి, నిలబడిన వైనాన్ని మెచ్చుకుంటున్నాను. సమంతను ఒక అమ్మలా రక్షించాలని ఉంది.. జీవితంలో ఎన్నో సవాళ్ళతో పోరాడి నిలబడిన వ్యక్తి సమంత.. ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఆమెను స్ఫూర్తిగా భావిస్తారో నేను అంతే. ప్రపంచంలోని ప్రేమ అంతా ఆమెకు దొరకాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. రష్మిక, సమంత కలిసి ఒకే ఫ్రేమ్ లో కలిసి నటించకపోయినా పుష్ప సినిమా వీరిద్దరిని కలిపింది. మరి రష్మిక ప్రేమకు సామ్ ఎలాంటి రిప్లై ఇస్తుందో చూడాలి.

Exit mobile version