Site icon NTV Telugu

Rashmika Mandanna: విజయ్ కోసం సీక్రెట్ గా అక్కడికెళ్లిన రష్మిక మందన్న?

Rashmika

Rashmika

Rashmika Mandanna Secretly Shooting for Vijay Deverakonda Familystar: విజయ్ దేవరకొండ రష్మిక మందన మధ్య ఉన్న రిలేషన్ ఏమిటనే విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. వీరిద్దరూ కలిసి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో నటించిన తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారని డేటింగ్ చేస్తున్నారని కూడా పలు సార్లు ప్రచారం జరిగింది. దానికి తగినట్టుగానే విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక దిగి పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూసి అభిమానులు ఇట్టే పసిగట్టేసి వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం చేస్తూనే వస్తున్నారు. అయితే తాజాగా రష్మిక తన యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్స్టాపబుల్ ఎపిసోడ్ కి హాజరు అవ్వగా అక్కడ కూడా వారిద్దరి మధ్య ఏదో ఉందని అర్థం వచ్చేలా కొన్ని సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ షూటింగ్లో రష్మిక దర్శనమిచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫోటోలలో న్యూఢిల్లీలో జరుగుతున్న ఫ్యామిలీ స్టార్ షూటింగ్లో ఆమె పాల్గొన్నట్లుగా హింట్ ఇచ్చింది.

Vijay Deverakonda: “రౌడీ ఇండియన్ స్ట్రీట్ కల్చర్” క్లాత్ బ్రాండ్ ను రీ లాంచ్ చేస్తున్న విజయ్ దేవరకొండ

అంతేకాదు త్వరలోనే ఈ విషయాన్ని వెల్లడిస్తానని ప్రస్తుతానికి అంతా సస్పెన్స్ అని చెప్పుకొచ్చింది. రష్మిక మందన ఏదైతే ఫోటో ని షేర్ చేసిందో అదే ఫోటోని దాదాపుగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా షేర్ చేసి ప్రస్తుతానికి న్యూఢిల్లీలో జరుగుతున్న ఫ్యామిలీ స్టార్ షూటింగ్లో బిజీబిజీగా గడుపుతున్నానని చెప్పుకొచ్చింది. ఇక దీన్ని బట్టి చూస్తే రష్మిక మందన ఏదైనా అతిథి పాత్రలో కనిపించబోతోందా అనే చర్చ జరుగుతోంది. కొందరైతే ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోగా నటిస్తున్న విజయ్ దేవరకొండను చూసేందుకు మాత్రమే ఆమె అక్కడికి వెళ్లి ఉంటుందని అప్పటికప్పుడు ఆమె కోసం ఏదైనా అతిథి పాత్ర డిజైన్ చేసి కూడా ఉండవచ్చని అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయనే విషయం ఆమె స్వయంగా వచ్చి క్లారిటీ ఇస్తే తప్ప ఒక పట్టాన కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.

Rashmika

Exit mobile version