Site icon NTV Telugu

Rashmika Mandanna: ఆ హీరోతో.. ఆ రూమర్స్ నిజమే

Rashmika

Rashmika

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా స్టార్ హీరోల సరసం నటిస్తున్న రష్మిక కొద్దిగా వీలు చిక్కినా ఖాళీగా లేకుండా వాణిజ్య ప్రకటనలోనూ నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఇక ఇప్పటికే బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా, అమితాబ్ బచ్చన్ సినిమాల్లో నటించే అవకాశం పట్టేసిన రష్మిక.. బాలీవుడ్ రీమేక్ వీరుడు టైగర్ ష్రాఫ్ పక్కన నటిస్తున్నదని వార్తలు గుప్పుమంటున్నాయి. బాలీవుడ్ లో రష్మిక మరో బంపర్ ఆఫర్ పెట్టేసిందని, టైగర్ ష్రాఫ్ కొత్త సినిమాలో రష్మిక హీరోయిన్ అంటూ వార్తలు హల్చల్ చేశాయి.

ఇక తాజాగా ఆ రూమర్స్ పై రష్మిక స్పందించింది. ఆ హీరోతో నటిస్తున్నాను అంటూ రూమర్స్ కు చెక్ పెట్టింది. అయితే అది సినిమా కాదు.. ఒక యాడ్ కోసం టైగర్, రష్మిక ఒకటయ్యారు. ఈ విషయాన్ని రష్మిక తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ ” అవును.. మీరు అంటున్న రూమర్స్ నిజమే.. నేను టైగర్ ష్రాఫ్ తో ఒక యాడ్ లో నటిస్తున్నాను. అతనితో నటించడం అద్భుతం. త్వరలోనే మీ ముందుకు రానున్నాం” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నేషనల్ క్రష్ లక్కీ ఛాన్స్ కొట్టేసిందని అభిమానులు పొగిడేస్తున్నారు. ఇక ఈ యాడ్ కోసం అమ్మడు భారీగానే రెమ్యూనిరేషన్ పుచ్చుకున్నదట. మరి ఈ యాడ్ ఏంటి..? ఈ జంట ఎలా కనిపించబోతున్నారు అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version