NTV Telugu Site icon

Rashmika: ఇంత పాజిటివ్ పర్సన్ ని ట్రోల్ చేస్తున్నారే…

Rashmika

Rashmika

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రష్మికపైన ఉన్నంత ట్రోలింగ్ మరో హీరోయిన్ పైన ఉండదు. రష్మిక ఏం చేసినా, ఎలాంటి ఫొటోస్ ని పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ఒక వర్గం బయటకి వచ్చి నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఇది శృతి మించుతూ ఉంటుంది కూడా. అత్యధిక మీమ్స్, ట్రోల్స్ ఉన్న ఏకైక పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మాత్రమే. కొందరు హీరోల ఫాన్స్ అయితే మరీను… ఆమె మా హీరో సినిమాలో వద్దు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా, ఎంత ట్రోలింగ్ వచ్చినా రష్మిక మాత్రం ఎప్పుడు వాటిపైన నెగటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది, నవ్వుతూనే సమాధానం ఇస్తుంది. పాజిటివిటీని చాలా ఎక్కువగా మైంటైన్ చేసే రష్మిక, ఏ నెగిటివ్ కామెంట్ ని తన బ్రెయిన్ కి తీసుకోదు, తనని కామెంట్స్ చేస్తున్న వాళ్లని ఇన్-డైరెక్ట్ గా ఒక్క మాట అనదు. అందుకే రష్మిక ఫాన్స్ ఆమెని చాలా పాజిటివ్ పర్సన్, చాలా మంచి నేచర్ అంటూ ఉంటారు. దీన్ని నిజం చేస్తూ లేటెస్ట్ గా మరో సంఘటన జరిగింది.

కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ అయ్యింది ఐశ్వర్య రాజేష్. ఇటీవలే ఫర్హానా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఐశ్వర్య రాజేష్, రిలీజ్ కి ముందు ఇచ్చిన ప్రమోషన్స్ లో “పుష్పలో శ్రీవల్లి లాంటి పాత్ర తనకి వస్తే బాగా చేస్తాను” అనే కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ ని కొంతమంది “పుష్పలో శ్రీవల్లి క్యారెక్టర్ నాకు ఇస్తే ఇంకా బాగా చేసేదాన్ని” అనేలా ప్రాజెక్ట్ చేసారు. దీంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరగడం, ఐశ్వయ రాజేష్ బయటకి వచ్చి “నా మాటలని తప్పుగా అర్ధం చేసుకున్నారు” అని క్లారిటీ ఇవ్వడం జరిగాయి. ఐశ్వర్య రాజేష్ లెటర్ రిలీజ్ చేసి ఈ వివాదానికి ఎండ్ కార్డు వేసే ప్రయత్నం చేసింది. ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి రష్మిక వరకూ వెళ్ళింది. “నేను ఇప్పుడే ఈ లెటర్ చూసాను. విషయం ఏంటంటే నువ్వు ఏ మీనింగ్ తో అన్నావో నాకు అర్ధం అయ్యింది, ఇలా మనకి మనం క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నీ పట్ల నాకు లవ్ అండ్ రెస్పెక్ట్ అలానే ఉంటుంది. నీ ఫర్హానా సినిమాకి ఆల్ ది బెస్ట్” అని రష్మిక రెస్పాండ్ అయ్యింది. ఇది చాలా చిన్న విషయమే కానీ తన ఫెలో మెంబర్ ఇబ్బంది పడుతూ ఉంటే రష్మిక రెస్పాండ్ అయిన విధానానికి అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇదంతా చుసిన రష్మిక ఫాన్స్… బంగారం సార్ మా నేషనల్ క్రష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments