Site icon NTV Telugu

Rashmika : “పిల్లల కోసం ఇప్పటి నుంచే రెడీ అవుతున్న” – రష్మిక మందన్నా స్పెషల్ స్టేట్‌మెంట్!

Rashmika

Rashmika

పాన్‌ ఇండియా స్టార్ రష్మిక మందన్నా నటిస్తున్న వరుస చిత్రాలో “ది గర్ల్‌ఫ్రెండ్”  ఒకటి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, నవంబర్‌ 7న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీకి అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలి నేనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వర్క్–లైఫ్ బ్యాలెన్స్, నటీనటుల పని ఒత్తిడి, భవిష్యత్తు ప్లాన్స్‌ గురించి ఓపెన్‌గా మాట్లాడింది.

రష్మిక మాట్లాడుతూ.. “ఓవర్‌వర్క్‌ చేయడం అనేది గొప్ప విషయం కాదు. నేను కూడా చాలా పని చేస్తాను కానీ ఇతరులు అలా చేయకూడదని చెబుతాను. మన శరీరం, మనసు విశ్రాంతి కోరుకుంటుంది. రోజుకు 8–10 గంటలు నిద్ర అవసరం. అదే భవిష్యత్తులో మనకు హెల్ప్ అవుతుంది. మాకు కూడా ఆఫీస్ టైమింగ్స్‌లా ఫిక్స్‌డ్‌ అవర్స్ ఉండాలి. 9–5 లేదా 9–6లా పని చేసి, మిగతా టైమ్ ఫ్యామిలీకి, హెల్త్‌కి ఇవ్వాలి. ఎందుకంటే నేను కూడా నా కుటుంబానికి టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా నిద్రపోవాలనుకుంటున్నాను, వర్కౌట్ చేయాలనుకుంటున్నాను. భవిష్యత్తులో పశ్చాత్తాపం ఉండకూడదని కోరుకుంటున్నాను” అని రష్మిక చెప్పింది.

తన భవిష్యత్తు గురించి మాట్లాడినప్పుడు రష్మిక ప్రత్యేకంగా చెప్పిన మాట అందరినీ ఆకట్టుకుంది.. “నేను ఇంకా తల్లిని కాలేదు. కానీ నాకు పిల్లలు పుడతారని తెలుసు, వారి కోసం ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాను. వారిని సురక్షితంగా ఉంచాలని, వారికి మంచి జీవితం ఇవ్వాలని ఉంది. వారి కోసం నేను ఏదైనా చేయడానికి ఫిట్‌గా ఉండాలి” అని ఆమె భావోద్వేగంగా చెప్పింది. “20–30 ఏళ్లలో కష్టపడాలి. 30–40లో వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌ సాధించాలి. 40 తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు, కానీ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి” అని రష్మిక పేర్కొంది. ఇక రష్మిక మాటలో తన ఫ్యూచర్ ప్లానింగ్ చూసి .. ఫ్యాన్స్ ఫీద అవుతున్నారు.

Exit mobile version