Site icon NTV Telugu

Rashmika Mandanna: ఈసారి దొరికిపోకుండా బాగా ప్లాన్ చేసావ్ బంగారు..

Rashmika

Rashmika

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో అమ్మడు బిజీగా మారింది. గతేడాది రిలీజ్ అయిన అనిమల్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ట్రెండ్ మార్క్ సృష్టించింది రష్మిక. ఇక అమ్మడి గురించి, విజయ్ దేవరకొండ గురించి ఎన్నో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటివరకు ఈ పెళ్లి వార్తలపై వీరిద్దరూ స్పందించింది లేదు. అయితే అభిమానులకు ఎప్పటికప్పుడు ఈ జంటపై అనుమానంగానే ఉంటుంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఎప్పుడు ఈ జంట ఒకే దగ్గర కనిపిస్తూ వస్తున్నారు. పార్టీలకు, వెకేషన్స్ కు వెళ్ళినా కూడా ఇద్దరూ జంటగానే వెళ్తున్నారు అనేది వాళ్ళు పెట్టే ఫొటోస్ వెనుక లొకేషన్స్ ద్వారా అభిమానులు కనిపెట్టిస్తున్నారు.

ఇక రష్మిక ప్రతి పండగకు ఒక ఫోటో పెట్టడం ఆనవాయితీగా మారింది. అది కూడా విజయ్ దేవరకొండ ఇంటి దగ్గర నుంచి పెట్టినట్లు ఎన్నోసార్లు రుజువు అయ్యింది. ఈసారి సంక్రాంతికి కూడా రష్మిక ఫోటో.. విజయ్ దేవరకొండ ఇంట్లో నుంచి వస్తుందని అభిమానులు ఊహించారు. అయితే అందుకు విరుద్ధంగా రష్మిక ఫోటోషూట్ చేసిన ఫోటోలను షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఒక అందమైన ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలతో అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఎరుపు లేహంగాలో ముద్దుగుమ్మ ఎంతో అందంగా కనిపించింది. ఈ ఫోటోను షేర్ చేస్తూ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు ప్రతిసారి విజయ్ దేవరకొండ ఇంట్లో కనిపిస్తూ దొరికిపోయేదానివి ఈసారి దొరికిపోకుండా బాగానే ప్లాన్ చేసావ్ బంగారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. లేకపోతే ప్రస్తుతం రష్మిక పుష్ప2, గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నటిస్తోంది మరి ఈ సినిమాలతో అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version