NTV Telugu Site icon

Rashmika: ఐపీఎల్ స్టేజిపై ‘నాటు నాటు’ స్టెప్స్ తో అదరగొట్టిన నేషనల్ క్రష్

Rashmika

Rashmika

Rashmika:క్రికెట్ అభిమానుల పండుగ మొదలయ్యింది. ఇప్పటివరకు అందరు కలిసి క్రికెట్ చూసిన వారు ఇక నుంచి మా టీమ్ ఇది.. మా టీమ్ అది అని వార్ మొదలుపెట్టేశారు. హా అర్థమైపోయిందిగా ఐపీఎల్ వచ్చేసింది. ఎంతో గ్రాండ్ గా నేడు ఐపీఎల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలయ్యింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు రష్మిక, తమన్నా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. తెలుగు, తమిళ్, హిందీ సాంగ్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్ తో నరేంద్ర మోడీ స్టేడియం మోత మోగిపోయింది.
Nani:దసరా కన్నా ముందు నాని ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో తెలుసా..?

మొట్టమొదటిసారి నాలుగు తెలుగు సాంగ్స్ ఐపీఎల్ స్టేజిపై వినిపించాయి. ఇక వీటికి నేషనల్ క్రష్ డ్యాన్స్ వేయడం విశేషం.. తాను నటించిన పుష్ప సినిమాలోని మూడు సాంగ్స్ కు డ్యాన్స్ వేసిన రష్మిక.. చివర్లో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కు పర్ఫెక్ట్ గా స్టెప్పులు వేసి అదరగొట్టేసింది. గోల్డ్ అండ్ వైట్ కలర్ డ్రెస్ లో రష్మిక అలవోకగా నాటు నాటు స్టెప్ వేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇంకోపక్క తమన్నా సైతం సిల్వర్ కలర్ డ్రెస్ లో మెరిసి సోషల్ మీడియా ట్రెండింగ్ సాంగ్ ‘టమ్ టమ్’ సాంగ్ కు కాలు కదిపింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments