Site icon NTV Telugu

Rashmika: థామా జర్నీ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది..

Rashmika Tama

Rashmika Tama

అందాల భామ రష్మిక మందన్నా తాజాగా నటించిన హారర్ కామెడీ చిత్రం “థామా” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మంచి టాక్ అందుకుంటుండటంతో రష్మిక ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె తన థామా జర్నీ గురించి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.

Also Read : Ravi Teja : RT76పై ఆషికా రంగనాథ్ నుంచి సాలిడ్ అప్డేట్ – స్పెయిన్‌లో షూట్ జోరుగా!

“థామా.. ఈ సినిమా నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రతి క్షణం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ఈ ప్రయాణంలో నవ్వులు, అలసట, కష్టాలు, గాయాలు అన్నీ ఉన్నాయి కానీ ఆ అనుభవం మాత్రం నా మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. కొన్ని ఉదయాలు షూట్‌కి వెళ్లాలనిపించలేదు, కానీ సెట్‌లో అడుగు పెట్టగానే అందరి ఎనర్జీ చూసి మళ్లీ జోష్ వచ్చేది” అని రష్మిక రాసుకొచ్చింది. అలాగే దర్శకుడు ఆదిత్య సర్పోదర్ గురించి మాట్లాడుతూ .. “ఆయన నాపై ఉంచిన నమ్మకం చాలా పెద్దది. ప్రతి సన్నివేశం వెనుక ఆయన ప్యాషన్, కష్టపడే తత్వం స్పష్టంగా కనిపించింది. మొత్తం టీమ్ సపోర్ట్ వల్లే ఈ సినిమా ఇంత బాగా పూర్తయింది. కొండల్లో షూటింగ్ చేసిన రోజులు, సిబ్బంది పడిన శ్రమ అన్నీ గుర్తు చేసుకుంటే గర్వంగా ఉంది” అని చెప్పింది.

తన అభిమానుల గురించి కూడా రష్మిక ప్రస్తావించింది.. “మీ అందరి ప్రేమ, మద్దతు, నమ్మకం నన్ను ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంటాయి. మీరు పంపే ప్రతి మెసేజ్‌, ప్రతి ఫీడ్బ్యాక్ నా హృదయాన్ని తాకుతుంది. ఈ ప్రేమే నా అసలైన శక్తి,” అని ఆమె భావోద్వేగంగా తెలిపింది. ఇక థామా సినిమాను మాడాక్ ఫిల్మ్స్ నిర్మించగా, స్త్రీ, భేడియా, ముంజ్యా వంటి హిట్స్ తర్వాత ఈ ప్రొడక్షన్ నుండి వచ్చిన మరో ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. రష్మికతో పాటు ఆయుష్మాన్ ఖురానా కూడా ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. థ్రిల్లింగ్ మూమెంట్స్, ఫన్ సీన్స్ కలిపి థామా సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తుందని టాక్.

Exit mobile version