Rashmika Mandanna about Vijay Deverakonda: రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ రిలేషన్ గురించి అనేక వార్తలు ఎప్పటికప్పుడు తెర మీదకు వస్తూనే ఉంటాయి. వీరిద్దరూ ప్రేమికులు అని అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతూ ఉండడంతో అనేక రకాల వార్తలు కూడా వండి వడ్డిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో తన రిలేషన్ గురించి రష్మిక మందన్న పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రష్మిక చేసే ప్రతి పనిలో విజయ్ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. ప్రతి చిన్న విషయంలోనూ విజయ్ దేవరకొండ సలహా తీసుకుంటా అది నాకు చాలా అవసరం అనిపిస్తుంది ఎందుకంటే విజయ్ దేవరకొండ ఏది మంచో ఏది చెడో వివరించి చెబుతాడు అని ఆమె పేర్కొన్నారు.
Srimanthudu: నా నవల నుంచి సీన్ టు సీన్ కాపీ కొట్టారు.. కొరటాల జైలుకు వెళ్లాల్సిందే!
అంతేకాక తన పర్సనల్ లైఫ్ లో కూడా విజయ్ దేవరకొండ అందరికంటే ఎక్కువగా సపోర్ట్ చేశాడని ఆమె పేర్కొన్నారు. ఇక తమ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగిందని ఫిబ్రవరిలో పెళ్లికూడా జరగబోతుందని అంటూ జరిగిన ప్రచారం మీద కూడా స్పందించింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి మీడియా సంస్థలు మా ఇద్దరికీ పెళ్లి చేయాలని భావిస్తున్నట్లు తనకు అనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. మీడియా వాళ్ళు నా చుట్టూ తిరుగుతూ నేను కనిపిస్తే పెళ్లి చేయాలని భావిస్తున్నారని ఆమె సరదాగా కామెంట్ చేసింది. విజయ్ దేవరకొండ తనకు మంచి స్నేహితుడు అని అర్థం వచ్చేలా ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతానికి రష్మిక చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. పుష్ప 2 రిలీజ్ కోసం ఆమె చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది పుష్ప 1 ఇచ్చిన బూస్ట్ కంటే ఇది మరింత బూస్ట్ ఇస్తుందని ఆమె భావిస్తోంది.
