Site icon NTV Telugu

Rashmika : బాలీవుడ్ సీక్వెల్‌లో రష్మిక మందన్న..

Rashmika

Rashmika

దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ప్రజంట్ బాలీవుడ్ టూ టాలీవుడ్ వరకు చక్రం తిప్పుతుంది. వరుస హిట్ అందుకుంటు ప్రజంట్ టాప్ పోజిషన్‌లో ఉంది. ముఖ్యంగా హింది‌లో కూడా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ధూసుకుపోతుంది. గత ఏడాది ఛావా సినిమాతో హిందీ ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న రష్మిక, ప్రస్తుతం హారర్ కామెడీ ఎంటర్టైనర్ తమాలో నటిస్తున్నారు. తాజాగా ఆమె మరో పెద్ద సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Also Read : Mirai : US బాక్సాఫీస్‌లో మిరాయ్ మ్యాజిక్.. భారీ ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్న తేజ సజ్జ

2012లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన కాక్‌టెయిల్ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. అసలు సినిమాలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పడుకోన్, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించి, ప్రేమ–స్నేహం–అనుబంధాలపై ఆధారపడి వచ్చిన ఈ కథ యువతను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే ఫ్రాంచైజ్‌లో ‘కాక్‌టెయిల్ 2’ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. కాగా సమాచారం ప్రకారం రష్మిక ఈ సినిమాలో భాగమవుతున్నట్లు చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్న ప్పటికీ, అధికారికంగా ఎలాంటి ధృవీకరణ రాలేదు. కానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఆమె ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన విషయాన్ని ప్రకటించారు. ఆన్-లొకేషన్ ఫోటోలను షేర్ చేస్తూ, “అపరిమితమైన వినోదానికి సిద్ధంగా ఉండండి” అంటూ క్యాప్షన్ జోడించారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో కాక్‌టెయిల్ 2 ప్రేక్షకుల ముందుకు రానున్నది. దీంతో బాలీవుడ్ ఆడియెన్స్‌లో ఈ సినిమాపై హైప్ మరింత పెరిగింది.

Exit mobile version