NTV Telugu Site icon

Rashmika Mandanna: అదేంటి రష్మిక పెళ్లి గురించి అలా అనేసింది!

Rashmika Puspa

Rashmika Puspa

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్​లో దూసుకెళ్తోంది. గతేడాది యానిమల్‌ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆమె ఓ హీరోతో రిలేషన్​లో ఉందంటూ గత కొంత కాలంగా రూమర్స్​ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. వారిద్దరు దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా ఉన్న ఫొటోలు ఎప్పుడైనా కనిపిస్తే సోషల్ మీడియా అంతా కూడా ఈ విషయమై చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి రష్మిక తన పెళ్లి విషయమై స్పందించింది. తాజాగా ‘కిస్సిక్‌’ సాంగ్​ను చెన్నై వేదికగా జరిగిన పుష్ప వైల్డ్‌ ఫైర్‌ వేడుకలో రిలీజ్ చేయగా ఆ వేదికపై రష్మిక తన పెళ్లి గురించి మాట్లాడింది. “నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన చిత్రం పుష్ప” అని రష్మిక చెప్పగా యాంకర్లు రష్మికను పెళ్లి విషయమై కూడా ప్రశ్నించారు. ‘ఇండస్ట్రీ చెందిన వ్యక్తిని చేసుకుంటారా? లేదా బయట వ్యక్తినా అని అడగగా “దీనికి సమాధానం అందరికీ తెలుసంటూ” రష్మిక చిరు నవ్వులు చిందించింది.

Allu Arjun: దేవిశ్రీ అసహనం.. బన్నీ కీలక వ్యాఖ్యలు!

ఆమె ఈ సమాధానం చెబుతూ చిరు నవ్వులు చిందించడం ఆ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ అయింది. ఇక అల్లు అర్జున్, శ్రీలీల కూడా రష్మిక సమాధానానికి నవ్వగా దానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాట్లాడుతూ… “ఇంత ప్రేమను అందిస్తున్న మీ అందరికీ నా నమస్కారం. రెండే మాటల్లో నేను చెప్పాలనుకుంటున్నాను. నా జీవితం పుష్పకు ముందు, పుష్ప కు తర్వాత అన్నట్లుగా ఈ సినిమాతో మారిపోయింది. ఏడేళ్ల నా సినీ కెరియర్లో ఐదేళ్లు పుష్పా సినిమాతో పనిచేశాను. ఈ చిత్ర బృందం నాకు ఎంతో స్పెషల్. అల్లు అర్జున్ గారు నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా నిలిచిపోయారు. అందరూ కలిసి డిసెంబర్ 5వ తేదీన పుష్ప సినిమాని థియేటర్లో కచ్చితంగా చూడండి. నాకు మీరు, మీ అభిమానం అంటే చాలా ఇష్టం” అన్నారు.

Show comments